ద్రవిడ్‌ హయాంలో మ్యాచ్‌ విన్నర్‌.. కట్‌చేస్తే.. గంభీర్‌ రాకతో ఒక్క మ్యాచ్ ఆడకుండానే కెరీర్ క్లోజ్..?

Team India: రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌గా ఉన్న సమయంలో టీమ్‌ఇండియాలో కీలక మ్యాచ్‌ విన్నర్‌గా ఎదిగిన మహ్మద్‌ షమీకి గౌతమ్‌ గంభీర్‌ హయాంలో పెద్దగా అవకాశాలు దక్కడం లేదు.

Venkat
Published on: 8 Sept 2026 7:38 PM IST
Team India
X

ద్రవిడ్‌ హయాంలో మ్యాచ్‌ విన్నర్‌.. కట్‌చేస్తే.. గంభీర్‌ రాకతో ఒక్క మ్యాచ్ ఆడకుండానే కెరీర్ క్లోజ్..?

Team India: రాహుల్‌ ద్రవిడ్‌ కోచింగ్‌లో టీమ్‌ఇండియాలో కీలక బౌలర్‌గా ఎదిగిన మహ్మద్‌ షమీకి ఇప్పుడు అంతర్జాతీయ కెరీర్‌పై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. గౌతమ్‌ గంభీర్‌ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత షమీకి అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ప్రస్తుతం అతడు ఏ ఫార్మాట్‌లోనూ భారత జట్టు ప్రణాళికల్లో కనిపించడం లేదు.

ద్రవిడ్‌ హయాంలో అదరగొట్టిన షమీ..

నవంబర్‌ 2021 నుంచి జూన్‌ 2024 వరకు రాహుల్‌ ద్రవిడ్‌ టీమ్‌ఇండియా హెచ్ కోచ్‌గా పనిచేశాడు. ఆ సమయంలో షమీ వన్డేలు, టెస్టుల్లో అద్భుతంగా రాణించాడు. అవసరమైనప్పుడు టీ20ల్లోనూ జట్టుకు సేవలందించాడు. ముఖ్యంగా 2023 వన్డే ప్రపంచకప్ (ODI World Cup)లో అతడి ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది.

వరల్డ్‌కప్‌లో 24 వికెట్లు..

2023 వన్డే ప్రపంచకప్‌లో కేవలం ఏడు మ్యాచ్‌ల్లోనే షమీ 24 వికెట్లు పడగొట్టి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. WTC 2021-23లోనూ 45 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ద్రవిడ్‌ హయాంలో టీమిండియాకు (Team India)కు షమీ ప్రధాన మ్యాచ్ విన్నర్‌గా మారాడు.

గంభీర్‌ కాలంలో తగ్గిన అవకాశాలు..

2023 ప్రపంచకప్‌ తర్వాత టెండన్‌ సర్జరీ కారణంగా షమీ సుదీర్ఘంగా ఆటకు దూరమయ్యాడు. 2025 ఆరంభంలో తిరిగి భారత జట్టులోకి వచ్చాడు. అనంతరం ఇంగ్లాండ్‌తో వైట్ బాల్ సీరీస్‌కు ఎంపికై, ఛాంపియన్ ట్రోఫీ (Champions Trophy)లోనూ ఆడాడు. గంభీర్‌ కోచింగ్‌లో ఇప్పటివరకు షమీ 9 మ్యాచ్‌లే ఆడి 14 వికెట్లు సాధించాడు. అతడి చివరి మ్యాచ్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్.

వయసు, పోటీ.. భవిష్యత్తు ఏంటి?

చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్న షమీకి ఇప్పటికీ కంబ్యాక్ అవకాశం రాలేదు. ప్రస్తుతం టీ20, వన్డేల్లో కొత్త ఫాస్ట్‌ బౌలర్లు పోటీ పెంచుతుండగా.. టెస్టుల్లోనూ యువ పేసర్లను సిద్ధం చేస్తున్నారు. షమీ వయసు 36 ఏళ్లకు చేరడంతో ఫిట్‌నెస్‌ కూడా కీలక అంశంగా మారింది. గంభీర్‌ పదవీకాలం 2027 చివరి వరకు ఉండటంతో, షమీకి తిరిగి టీమిండియాలో చోటు దక్కడం ఎంతవరకు సాధ్యమన్నది ఆసక్తికరంగా మారింది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story