CSK Win-MS Dhoni: సీఎస్‌కే రెండో విజయం వెనక ఎంఎస్ ధోనీ.. అసలు విషయం చెప్పిన బౌలింగ్ కోచ్!
CSK Win-MS Dhoni: సీఎస్‌కే వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. రెండో విజయాన్ని అందుకోవడంలో ఎంఎస్ ధోనీ కీలక పాత్ర పోషించినట్లు అసిస్టెంట్ బౌలింగ్ కోచ్ వెల్లడించాడు.
CSK Win-MS Dhoni: సీఎస్‌కే రెండో విజయం వెనక ఎంఎస్ ధోనీ.. అసలు విషయం చెప్పిన బౌలింగ్ కోచ్!
CSK Win-MS Dhoni: చెపాక్ వేదికగా మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) అద్భుత విజయాన్ని అందుకుంది. దాంతో సీఎస్‌కే వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సీఎస్‌కే రెండో విజయాన్ని అందుకోవడంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కీలక పాత్ర పోషించినట్లు జట్టు అసిస్టెంట్ బౌలింగ్ కోచ్ శ్రీధరన్ శ్రీరామ్ వెల్లడించాడు. యువ స్పిన్నర్ నూర్ అహ్మద్ అద్భుత ప్రదర్శన వెనుక ధోనీ సూచనలు ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపాడు.
సీఎస్‌కే ఆడిన గత మూడు మ్యాచ్‌లలో నూర్ అహ్మద్ పెద్దగా ప్రభావం చూపించలేదు. కోల్‌కతాపై మాత్రం సత్తా చాటాడు. నాలుగు ఓవర్ల కోటాలో 21 పరుగులు మాత్రమే ఇచ్చి.. 3 వికెట్లు పడగొట్టాడు. అతడి స్పెల్ మ్యాచ్‌ను పూర్తిగా మలుపుతిప్పింది. కేకేఆర్ బ్యాటింగ్ లైన్‌ను కుదిపేసి.. సీఎస్‌కే విజయానికి మార్గం సుగమం చేశాడు. చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించిన నూర్ అహ్మద్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
నూర్ అహ్మద్ ఈ సూపర్ ప్రదర్శన వెనక ఎంఎస్ ధోనీ సలహాలు ఉన్నట్లు కోచ్ శ్రీధరన్ శ్రీరామ్ తెలిపాడు. ప్రాక్టీస్ సెషన్‌లో అహ్మద్‌తో ధోనీ ప్రత్యేకంగా మాట్లాడినట్లు వెల్లడించాడు. లెగ్ బ్రేక్ బౌలింగ్‌ను మెరుగుపర్చుకోవాలని సూచించాడని తెలిపాడు. ధోనీ ఇచ్చిన సూచనలు నూర్‌కు ఎంతో ఉపయోగపడ్డాయని, మ్యాచ్‌లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించిందని చెప్పాడు.
'నూర్ అహ్మద్ కేకేఆర్ మ్యాచ్ ముందు వరకూ పెద్దగా ప్రభావం చూపించలేదు. అందుకే ఈసారి మంచి ప్రదర్శన ఇవ్వాలనే లక్ష్యంతో దిగాడు. మ్యాచ్ ముందు ఎంఎస్ ధోనీతో సుదీర్ఘంగా చర్చించాడు. ప్రాక్టీస్ సెషన్స్‌లో మహీ విలువైన సూచనలు ఇచ్చాడు. లెగ్ బ్రేక్‌కు సంబంధించి చేసిన సూచన బాగా వర్కౌట్ అయింది. అహ్మద్‌కు మొదటి మూడు మ్యాచులలో ఎక్కువ వికెట్లు రాకపోవడానికి ఫ్లాట్ పిచ్‌లు కూడా కారణం.
అలాంటి పిచ్‌లపై ఎలా బౌలింగ్ చేయాలనే దానిపై వర్కౌట్ చేస్తున్నాడు. షార్ట్ లేదా ఫుల్‌గా బంతులకు ఎక్కువగా పరుగులు ఇచ్చేశాడు. లెంగ్త్‌ను సరిచేసుకున్నపుడు అతడి బౌలింగ్‌ను ఆడటం కష్టంగా మారుతుంది. నూర్ బలం ఏంటంటే.. బంతిని నెమ్మదిగా స్పిన్ చేయడం. బ్యాటర్ అనుకున్నంత వేగంగా అతడి బంతి రాదు. నిలకడగా బంతిని టర్న్ చేస్తే.. నూర్ వేసే బంతులు ఆడడం బ్యాటర్లకు చాలా కష్టం' అని శ్రీధరన్ శ్రీరామ్ చెప్పుకొచ్చాడు.
కేకేఆర్ మ్యాచ్‌తో నూర్ అహ్మద్ ఐపీఎల్ కెరీర్‌లో 50 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. యువ బౌలర్‌గా అతడు చూపిస్తున్న ప్రతిభ అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఒత్తిడిలోనూ వికెట్లు తీసే సామర్థ్యం అతడిని ప్రత్యేకంగా నిలబెడుతోంది. వరుస ఓటముల తర్వాత సీఎస్‌కే తిరిగి ఫామ్‌లోకి వచ్చి.. వరుస విజయాలు సాధించడం జట్టుకు మంచి సంకేతంగా మారింది. ఎంఎస్ ధోనీ మార్గదర్శకత్వం, యువ ఆటగాళ్ల ప్రదర్శనతో జట్టు మరింత బలంగా మారుతోంది. రాబోయే మ్యాచ్‌ల్లో కూడా ఇదే జోరు కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.




