MS Dhoni Return: అనుకున్నదానికంటే ముందుగానే.. ఎంఎస్ ధోనీ రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

MS Dhoni Return: చెన్నై అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విషయం మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఎంట్రీ. తాజాగా సమాచారం ప్రకారం అనుకున్నదానికంటే ముందుగానే బరిలోకి దిగనున్నాడు.

Rishvik
Published on: 15 April 2026 7:16 PM IST
MS Dhoni Return
X

MS Dhoni Return: అనుకున్నదానికంటే ముందుగానే.. ఎంఎస్ ధోనీ రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

MS Dhoni Return: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు ఇప్పుడిప్పుడే ఫామ్‌లోకి వస్తోంది. వరుసగా మూడు ఓటముల తర్వాత.. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచింది. గత రెండు మ్యాచ్‌లలో ఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్)పై విజయాలు సాధించి తిరిగి ట్రాక్‌లోకి వచ్చింది.

రెండు అద్భుత విజయాలతో సీఎస్‌కే అభిమానుల్లో జోష్ పెరిగింది. అయితే చెన్నై అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విషయం మాత్రం మాజీ కెప్టెన్, లెజెండ్ ఎంఎస్ ధోనీ ఎంట్రీ. తాజాగా సమాచారం ప్రకారం.. అనుకున్నదానికంటే ముందుగానే మహీ మైదానంలోకి బరిలోకి దిగనున్నాడు.

ఎంఎస్ ధోనీ పిక్క కండరాల గాయంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. గాయం కారణంగా ఐపీఎల్ 2026 తొలి రెండు వారాలు మహీ దూరమయ్యాడు. కేకేఆర్ మ్యాచ్‌లో ఆడతాడని భావించినా.. మహీ బరిలోకి దిగలేదు. ఏప్రిల్ 18న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌కు ధోనీ అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ధోనీకి త్వరలోనే మరోసారి ఫిట్‌నెస్‌ టెస్ట్ చేయనున్నారట.

మ్యాచ్‌కు ముందు రోజున మహీ ఆడడంపై సీఎస్‌కే మేనేజ్‌మెంట్ తుది నిర్ణయం తీసుకోనుంది. హైదరాబాద్‌కు జట్టుతో కలిసి ట్రావెల్ చేస్తాడా? లేదా? అనేది రేపటి లోపు తేలిపోనుంది. ఒకవేళ ధోనీ ప్లేయింగ్ 11లో ఉంటే.. తప్పక హైదరాబాద్‌ వస్తాడు. మహీ హైదరాబాద్‌ వచ్చాడంటే.. మ్యాచ్ ఆడుతాడని ఫిక్స్ అయిపోవచ్చు.

ఇప్పటికే విజయాల బాట పట్టిన సీఎస్‌కేకు ఎంఎస్ ధోనీ రీఎంట్రీ పెద్ద బూస్ట్‌గా మారనుంది. మహీ అనుభవం, సూచనలు జట్టుకు మరింత బలం చేకూర్చనుంది. ధోనీ రీఎంట్రీపై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి మహీ అనుకున్న దానికంటే కాస్త ముందుగానే మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌పై సంజు శాంసన్ సెంచరీ, జెమీ ఓవర్టన్ బౌలింగ్ జట్టుకు తొలి విజయాన్ని అందించాయి. కేకేఆర్‌పై కూడా ఆటగాళ్లు సమిష్టిగా రాణించి రెండో విజయాన్ని అందించారు. అయితే ఈ రెండూ విజయాలు హోం గ్రౌండ్ చెపాక్ మైదానంలోనే రావడం విశేషం.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story