MS Dhoni: చిన్న 'తల' చెప్పేశాడు.. ఎంఎస్ ధోనీ రీ-ఎంట్రీ ఫిక్స్, ఫుల్ జోష్‌లో సీఎస్‌కే ఫ్యాన్స్!
MS Dhoni is set to return in IPL 2026. సీఎస్‌కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నేడు ఐపీఎల్ మ్యాచ్ ఆడనున్నట్లు తెలుస్తోంది.
MS Dhoni
MS Dhoni: ఐపీఎల్ 2026 సీజన్‌లో మరో హై-వోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. శనివారం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), ముంబై ఇండియన్స్ (ఎంఐ) మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ పోరుకు ముందుగా సీఎస్‌కే అభిమానులకు ఓ శుభవార్త. సీఎస్‌కే మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీ నేడు ఐపీఎల్ మ్యాచ్ ఆడనున్నట్లు తెలుస్తోంది. ధోనిని నేటి మ్యాచ్‌లో చూస్తామని చిన్న 'తల' సురేష్ రైనా తెలిపాడు. దాంతో సీఎస్‌కే ఫ్యాన్స్ మహీ ఆట కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
గాయం కారణంగా ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇప్పటివరకు ఎంఎస్ ధోనీ ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఇటీవల ఫిట్‌నెస్ టెస్ట్ పాసయ్యాడని వార్తలు వచ్చినా.. మైదానంలోకి మాత్రం దిగలేదు. గత 2-3 మ్యాచులుగా జట్టుతో పాటే ప్రయాణిస్తున్నాడు. మైదానంలో మహీని ఎప్పుడు చూస్తామా? అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. చెన్నై కోచ్ మైక్ హస్సీ మాట్లాడుతూ.. ధోనీ గాయం నుంచి కోలుకున్నాడని.. ఆడతాడా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేమని తాజాగా వెల్లడించాడు. దాంతో ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయ్యారు. అయితే చిన్న తల సురేశ్ రైనా అభిమానులకు శుభవార్త చెప్పాడు. మహీని ఈరోజటి మ్యాచ్‌లో చూస్తామని తెలిపాడు. విషయం తెలిసిన ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఫిట్‌నెస్ టెస్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఎంఎస్ ధోనీ నేటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం సీఎస్‌కేకు పెద్ద బూస్ట్‌గా మారింది. అతని అనుభవం, ఫినిషింగ్ సామర్థ్యం జట్టుకు కీలకంగా ఉండనుంది. ధోనీ రీ-ఎంట్రీతో సీఎస్‌కే మిడిల్ ఆర్డర్ మరింత బలపడింది. కార్తిక్ శర్మ స్థానంలో ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మార్పుతో జట్టు సమతుల్యత పెరిగి.. మ్యాచ్‌పై పట్టును సాధించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ధోనీ జట్టులోకి రావడంతో సీఎస్‌కేకు ఆత్మవిశ్వాసం పెరుగుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్లేఆఫ్స్ రేసులో టాప్-4లో నిలవాలంటే ఈ మ్యాచ్ చెన్నైకి చాలా కీలకం.
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు (అంచనా):
సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, డెవాల్డ్ బ్రేవిస్, శివమ్ దూబే, సర్ఫరాజ్ ఖాన్, ఎంఎస్ ధోనీ, జెమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, గుర్జప్నీత్, ముఖేష్, కాంబోజ్.




