Dhoni Comeback: సీఎస్‌కే-ఎల్‌ఎస్‌జీ మ్యాచ్‌కు ముందు ఆసక్తికర అప్‌డేట్!
Dhoni Comeback: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రీఎంట్రీ కోసం సీఎస్‌కే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Dhoni Comeback: సీఎస్‌కే-ఎల్‌ఎస్‌జీ మ్యాచ్‌కు ముందు ఆసక్తికర అప్‌డేట్!
Dhoni Comeback: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రీఎంట్రీ. ఈ సీజన్ ప్రారంభానికి ముందు ప్రాక్టీస్ సమయంలో కాల్వ్ ఇంజరీకి గురైన ధోనీ.. ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ)తో శుక్రవారం జరిగే కీలక మ్యాచ్‌కు ముందు ధోనీ గురించి ఓ అప్‌డేట్ బయటకు వచ్చింది. సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ధోనీ లక్నో ప్రయాణానికి టికెట్ బుక్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ధోనీ బరిలోకి దిగుతాడా అనే చర్చ జోరందుకుంది.
ఇప్పటివరకు ఎంఎస్ ధోనీ ఈ సీజన్‌లో కేవలం రెండు అవే మ్యాచ్‌లకే జట్టుతో కలిసి వెళ్లాడు. ఆ మధ్య హైదరాబాద్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో మహీ ప్రాక్టీస్ చేశాడు. ధోనీ ఆడడం ఖాయమే అనుకున్నా.. అభిమానులకు నిరాశ తప్పలేదు. అయితే ఇప్పుడు లక్నోకు కూడా చెన్నై జట్టుతో ప్రయాణించనున్నాడని తెలుస్తోంది. సీఎస్‌కే మేనేజ్‌మెంట్, ఆటగాళ్లు కూడా ధోనీ తిరిగి జట్టులో చేరుతాడనే ఆశాభావంతో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం 44 ఏళ్ల వయసులో ఉన్న ధోనీ.. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో కనీసం ఒక మ్యాచ్‌లో అయినా ఆడే అవకాశాలు ఉన్నాయని ఓ జాతీయ మీడియా పేర్కొంది.
అయితే ఎంఎస్ ధోనీ మాత్రం ప్రస్తుతం ఉన్న విజయవంతమైన జట్టు కాంబినేషన్‌ను మార్చడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. సీఎస్‌కే ప్రస్తుతం వరుసగా మూడు విజయాలతో మంచి జోష్‌లో ఉంది. అందుకే గెలుపు జట్టులో మార్పులు చేయడంపై ధోనీ కొంత ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. సీఎస్‌కే సాధారణంగా గెలిచే కాంబినేషన్‌ను మార్చదని, అందుకే ధోనీ ఎల్‌ఎస్‌జీ మ్యాచ్‌లో ఆడకపోవచ్చని చెప్పాడు.
అనిల్ కుంబ్లే మాట్లాడుతూ.. ‘ఎంఎస్ ధోనీ నెట్స్‌లో చాలా సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. వికెట్ కీపింగ్ కూడా చేస్తున్నాడు. సాధారణంగా ధోనీ నెట్స్‌లో ఎక్కువగా వికెట్ కీపింగ్ చేయడు. కానీ ఇప్పుడు పూర్తి మ్యాచ్ ఫిట్‌నెస్ కోసం చాలా కష్టపడుతున్నాడు’ అని తెలిపాడు. ఇది అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచింది. ఇక సీఎస్‌కే ఈ సీజన్‌ను పేలవంగా ప్రారంభించినప్పటికీ.. చివరి నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం 10 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో ఐదవ స్థానంలో ఉన్న చెన్నై.. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండు గెలిస్తే ప్లేఆఫ్స్ అవకాశాలు బలపడతాయి. ఎల్‌ఎస్‌జీ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో హోమ్ మ్యాచ్, గుజరాత్ టైటాన్స్‌తో అవే మ్యాచ్ సీఎస్‌కే ఆడనుంది. ఈ నేపథ్యంలో ధోనీ రీఎంట్రీపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.




