Punjab Kings: కాటేరమ్మ కొడుకుల రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన సర్పంచ్ సాబ్ టీం
Punjab Kings: ముల్లన్‌పూర్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఆర్య, నల్లీ వీరవిహారం చేశారు.
Punjab Kings: కాటేరమ్మ కొడుకుల రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన సర్పంచ్ సాబ్ టీం
Arya-Connolly: ముల్లన్‌పూర్ మైదానంలో సిక్సర్ల సునామీ ముంచెత్తింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు మొదట్లోనే షాక్ తగిలింది. తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయి పంజాబ్ కష్టాల్లో పడటంతో అభిమానులు నిశ్శబ్దమైపోయారు. కానీ, అది తుఫాను ముందు వచ్చే ప్రశాంతత అని అప్పుడు ఎవరూ ఊహించలేదు.
విధ్వంసకర భాగస్వామ్యం
క్రీజులోకి వచ్చిన ప్రియాంశ్ ఆర్య, కూపర్ కానల్లీ.. లక్నో బౌలర్లపై కనికరం లేకుండా విరుచుకుపడ్డారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 182 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి చరిత్ర సృష్టించారు. పంజాబ్ ఫ్రాంచైజీ చరిత్రలో గిల్‌క్రిస్ట్-షాన్ మార్ష్ (206) తర్వాత ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం.
మార్క్రామ్ ఓవర్‌లో 32 పరుగులు
మ్యాచ్‌కే హైలైట్ ఏదైనా ఉందంటే అది ఐడెన్ మార్క్రామ్ వేసిన ఆ ఓవర్. ఆర్య-కానల్లీ జోడీ మార్క్రామ్‌ను టార్గెట్ చేస్తూ వరుసగా ఐదు భారీ సిక్సర్లు బాదారు. ఆ ఒక్క ఓవర్‌లోనే 32 పరుగులు పిండుకుని స్టేడియాన్ని హోరెత్తించారు. దీంతో లక్నో టీమ్ చరిత్రలో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా మార్క్రామ్ అప్రతిష్టను మూటగట్టుకున్నాడు.
కానల్లీ కెరీర్ బెస్ట్..
యంగ్ సెన్సేషన్ కూపర్ కానల్లీ ఈ మ్యాచ్‌లో విశ్వరూపం చూపాడు. తన టీ20 కెరీర్‌లోనే అత్యుత్తమంగా 87 పరుగులు చేసి, గతంలో తన పేరిట ఉన్న 77 పరుగుల రికార్డును చెరిపివేశాడు. అటు ఆర్య, ఇటు కానల్లీ సెంచరీలకు చేరువగా వచ్చి అవుట్ అయినప్పటికీ, వారు చేసిన విధ్వంసం పంజాబ్‌కు కొండంత స్కోరును అందించింది.
పంజాబ్ టాప్-3 బ్యాటర్లు కలిపి మొత్తం 16 సిక్సర్లు బాది, 2024లో కోల్‌కతాపై నెలకొల్పిన రికార్డును సమం చేశారు. లక్నో జట్టుపై గతంలో అభిషేక్ శర్మ-ట్రావిస్ హెడ్ (167) పేరిట ఉన్న అత్యధిక భాగస్వామ్య రికార్డును ఈ జోడీ తుడిచిపెట్టేసింది. రిషబ్ పంత్ నాయకత్వంలోని లక్నో బౌలర్లు ఈ యువ ఆటగాళ్ల ధాటికి మైదానంలో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ముల్లన్‌పూర్ పిచ్‌పై పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు రాసిన ఈ రికార్డులు ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోనుంది.




