IPL 2027: ముంబయి ఇండియన్స్‌ సంచలన నిర్ణయం.. దిగ్గజ బౌలింగ్ కోచ్ మలింగ అవుట్.. రంగంలోకి కొత్త కోచ్‌లు!

Mumbai Indians: ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ భారీ ప్రక్షాళన. హెడ్ కోచ్‌గా కీరన్ పొలార్డ్.. లసిత్ మలింగ, పరాస్ మాంబ్రేలతో సహా ముగ్గురు కోచ్‌లపై వేటు.

Arun Chilukuri
Published on: 29 Oct 2026 5:33 PM IST
IPL 2027
X

IPL 2027: ముంబయి ఇండియన్స్‌ సంచలన నిర్ణయం.. దిగ్గజ బౌలింగ్ కోచ్ మలింగ అవుట్.. రంగంలోకి కొత్త కోచ్‌లు!

Mumbai Indians: గత కొన్నాళ్లుగా ఇండియన్ ప్రిమియర్ లీగ్ (IPL)లో తీవ్ర పేలవ ప్రదర్శన చేస్తోన్న ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) ఫ్రాంఛైజీ రాబోయే సీజన్‌లో మళ్లీ విజేతగా నిలవడమే లక్ష్యంగా భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. జట్టు ఫలితాలను మెరుగుపరిచే క్రమంలో కోచింగ్ స్టాఫ్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని యాజమాన్యం నిర్ణయించింది.

మొన్నటివరకు హెడ్ కోచ్‌గా వ్యవహరించిన మహేళ జయవర్ధనెను పదవి నుంచి తప్పించి, జట్టు మాజీ ఆల్‌రౌండర్, వెస్టిండీస్ దిగ్గజం కీరన్ పొలార్డ్ (Kieron Pollard) కు హెడ్ కోచ్ బాధ్యతలు అప్పగించారు.

పొలార్డ్ నియామకం తర్వాత తాజాగా బౌలింగ్ కోచ్‌లు లసిత్ మలింగ (Lasith Malinga), పరాస్ మాంబ్రే (Paras Mhambrey) లతో పాటు ఫీల్డింగ్ కోచ్ కార్ల్ హాప్కిన్సన్ ను తప్పించినట్లు ముంబయి ఇండియన్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది.

ముంబయి ఇండియన్స్ 2013, 2015, 2017, 2019లలో ఛాంపియన్‌గా నిలవడంలో మలింగ ప్రధాన పాత్ర పోషించాడు. ఆట తర్వాత మెంటార్‌గా, బౌలింగ్ కోచ్‌గా సేవలందించాడు. అలాగే 2010 నుంచి 2017 వరకు జట్టుతో ఉన్న మాంబ్రే, టీమిండియా బౌలింగ్ కోచ్ పదవీకాలం ముగిశాక తిరిగి ముంబయిలో చేరారు.

కోచింగ్ స్టాఫ్‌కు వీడ్కోలు చెప్పిన ముంబయి యాజమాన్యం, వారి స్థానంలో కొత్త కోచ్‌లుగా ఎవరిని నియమించనున్నారనే విషయాన్ని త్వరలోనే వెల్లడించనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.