Naman Dhir 5 Sixes in an over: ఒకే ఓవర్లో 5 సిక్సర్లు.. 37 బంతుల్లోనే 91 రన్స్.. ఊచకోత కోసిన నమన్ ధీర్..!
Naman Dhir 5 Sixes in an over: పంజాబ్ టీ20 (Punjab T20) లీగ్ సెమీఫైనల్ పోరులో అమృత్‌సర్ సూర్మాస్ (Amritsar Soormas) బ్యాటర్ నమన్ ధీర్ (Naman Dhir) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
Naman Dhir 5 Sixes in an over: ఒకే ఓవర్లో 5 సిక్సర్లు.. 37 బంతుల్లోనే 91 రన్స్.. ఊచకోత కోసిన నమన్ ధీర్..!
Naman Dhir 5 Sixes in an over: పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియం (IS Bindra Stadium) వేదికగా శనివారం జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో అమృత్‌సర్ సూర్మాస్ అద్భుత విజయాన్ని అందుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన మొహాలీ (Mohali) నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగా, ఛేదనలో నమన్ ధీర్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 37 బంతుల్లోనే 91 పరుగులు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
అమృత్‌సర్ కేవలం 16.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ అద్భుత ఇన్నింగ్స్ తో మోహాలీ నిర్దేశించిన భారీ టార్గెట్ ఏమాత్రం కష్టమనిపించలేదు. ముఖ్యంగా ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో నమన్ ధీర్ ప్రదర్శించిన పవర్ హిట్టింగ్ మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది.
లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్ష్‌దీప్ సింగ్ (Harshdeep Singh) వేసిన ఆ ఓవర్లో ధీర్ మొదటి మూడు బంతులను వరుసగా లాంగాన్, స్ట్రెయిట్ దిశల్లో భారీ సిక్సర్లుగా మలిచాడు.
నాలుగో బంతి ప్యాడ్లకు తాకడంతో పరుగు రాలేదు. ఐదో బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా, ఆఖరి బంతిని సైట్‌స్క్రీన్ వైపు స్ట్రెయిట్ సిక్సర్‌గా బాది స్టేడియాన్ని హోరెత్తించాడు. ఒకే ఓవర్లో 30 పరుగులు పిండుకోవడంతో అమృత్‌సర్ విజయం లాంఛనమైంది.
టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదిన క్రిస్ గేల్ (Chris Gayle), రాహుల్ తెవాతియా (Rahul Tewatia), రింకూ సింగ్ (Rinku Singh) వంటి దిగ్గజాల సరసన ఇప్పుడు ధీర్ చోటు దక్కించుకున్నాడు.
ప్రస్తుత సీజన్ లో నమన్ ధీర్ నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 78.25 సగటు, 216.61 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 626 పరుగులు రాబట్టాడు.
ఇందులో 173 (64 బంతుల్లో), 117 (56 బంతుల్లో), 95, 88 వంటి భారీ స్కోర్లు ఉన్నాయి. భారత క్రికెట్ జట్టు (Team India) మిడిలార్డర్‌లో తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ, 26 ఏళ్ల ఈ యువ బ్యాటర్ నిలకడైన ఫామ్ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది.




