Neymar: ఫుట్‌బాల్ ప్రపంచంలో పెను సంచలనం.. అంతర్జాతీయ రిటైర్మెంట్ ప్రకటించిన నేమార్!
Neymar: ఫిఫా వరల్డ్‌కప్ రౌండ్ ఆఫ్ 16 పోరులో నార్వే చేతిలో బ్రెజిల్ పరాజయం పాలైన తర్వాత.. బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ నేమార్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు సంచలన రిటైర్మెంట్ ప్రకటించాడు.
Neymar: ఫుట్‌బాల్ ప్రపంచంలో పెను సంచలనం.. అంతర్జాతీయ రిటైర్మెంట్ ప్రకటించిన నేమార్!
Neymar: ఫిఫా వరల్డ్‌కప్ రౌండ్ ఆఫ్ 16 పోరులో నార్వే చేతిలో బ్రెజిల్ 2 -1 తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమి తర్వాత బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ నేమార్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే 34 ఏళ్ల నేమార్ భావోద్వేగానికి గురవుతూ.. తన 16 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు వెల్లడించాడు. బ్రెజిల్ జట్టుతో తన ప్రయాణం ముగిసిందని స్పష్టం చేశాడు. ఈ ఉత్కంఠ మ్యాచ్‌లో నార్వే ఆటగాడు ఎర్లింగ్ హాలాండ్ చివరి నిమిషాల్లో వరుసగా రెండు గోల్స్ చేసి బ్రెజిల్‌కు గట్టి షాక్ ఇచ్చాడు. స్టాపేజ్ టైమ్‌లో నేమార్ పెనాల్టీని గోల్‌గా మలిచినప్పటికీ బ్రెజిల్‌కు ఓటమి తప్పలేదు.
2010లో సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన నేమార్.. బ్రెజిల్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. మొత్తం 129 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 80 గోల్స్ సాధించాడు. నాలుగు ఫిఫా వరల్డ్ కప్‌లలో బ్రెజిల్ ఫుట్‌బాల్‌కు ఫేస్ ఐకాన్‌గా నిలిచినప్పటికీ, ప్రపంచకప్ ట్రోఫీని మాత్రం అందుకోలేకపోయాడు. అయితే, 2013లో ఫిఫా కాన్ఫెడరేషన్స్ కప్, 2016 రియో ఒలింపిక్స్‌లో కెప్టెన్‌గా బ్రెజిల్‌కు బంగారు పతకం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం అందించాడు. మ్యాచ్ ముగిశాక మైదానంలో నేమార్ కన్నీళ్లు పెట్టుకోగా.. సహచర ఆటగాళ్లు అతడిని ఓదార్చారు. ఈ ఓటమితో కోచ్ కార్లో అన్సెలొట్టి ఆధ్వర్యంలోని బ్రెజిల్ వరల్డ్ కప్ ప్రస్థానం కూడా ముగిసింది.




