భారత్‌పై గెలవడమే కావాలి.. ఆసియా కప్ ట్రోఫీ వద్దంటోన్న పాక్ అభిమాని
India vs Pakistan Women: ఉమెన్స్ ఆసియా కప్ 2026లో హాంకాంగ్‌పై పాకిస్థాన్ విజయం సాధించిన తర్వాత ఓ అభిమాని ఆ జట్టు హెడ్ కోచ్ వహాబ్ రియాజ్‌కు ఆసక్తికర విజ్ఞప్తి చేశాడు.
భారత్‌పై గెలవడమే కావాలి.. ఆసియా కప్ ట్రోఫీ వద్దంటోన్న పాక్ అభిమాని
India vs Pakistan Women: ఉమెన్స్ టీ20 ఆసియా కప్ 2026లో హాంకాంగ్‌పై పాకిస్థాన్ గెలిచి సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న తర్వాత ఓ అభిమాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మ్యాచ్ అనంతరం అభిమానులతో మాట్లాడుతున్న పాకిస్థాన్ హెడ్ కోచ్ వహాబ్ రియాజ్‌ను ఉద్దేశించి.. ఆసియా కప్ ట్రోఫీ కంటే భారత్‌పై గెలుపే తమకు ముఖ్యమని ఆ అభిమాని చెప్పాడు.
వీడియోలో వైరల్‌గా మారిన మాటలు..
స్టేడియం సమీపంలో వహాబ్ రియాజ్‌తో అభిమాని మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. భారత్‌తో మ్యాచ్‌లో గెలవాలని పాకిస్థాన్ జట్టుకు సూచించాడు. ఆసియా కప్ ట్రోఫీ అవసరం లేదని, భారత్‌ను ఓడించడమే తమ కోరిక అని స్పష్టం చేశాడు. ఈ వ్యాఖ్యలు మ్యాచ్ అనంతరం అభిమానుల దృష్టిని ఆకర్షించాయి.
సెమీస్‌లో పాక్.. భారత్‌కు మరో ప్రత్యర్థి..
హాంకాంగ్‌పై విజయం తర్వాత పాకిస్థాన్ ఉమెన్స్ ఆసియా కప్ (Women’s Asia Cup)లో సెమీఫైనల్‌కు చేరింది. చివరి నాలుగు దశలో పాకిస్థాన్ శ్రీలంకతో తలపడనుంది. మరో సెమీఫైనల్‌లో భారత్.. బంగ్లాదేశ్ లేదా యూఏఈలో ఒక జట్టుతో ఆడనుంది. దీంతో భారత్, పాకిస్థాన్ మరోసారి తలపడాలంటే ఫైనల్ వరకు వెళ్లాల్సి ఉంటుంది.
గ్రూప్ దశలో భారత్‌దే పైచేయి..
ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ ఇప్పటికే ఒకసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత పాకిస్థాన్‌ను కేవలం 55 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. లక్ష్యాన్ని 8.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో టైటిల్ రేసులో భారత్ తన స్థాయిని చాటుకుంది.
ఫాతిమా సనాపై చర్య..
భారత్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా వివాదంలో చిక్కుకుంది. షఫాలీ వర్మను క్యాచ్ అండ్ బౌల్డ్‌గా ఔట్ చేసిన అనంతరం ఆమె చేసిన సంజ్ఞపై ఐసీసీ చర్యలు తీసుకుంది. కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్-1 ఉల్లంఘనకు ఫాతిమాకు మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానాతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ విధించింది.




