Pat Cummins: నేను కూడా చాలా డిజప్పాయింట్ అయ్యా.. ఎంఎస్ ధోనీ ఆరా వేరే లెవెల్!

Pat Cummins about MS Dhoni. క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీపై ఎస్‌ఆర్‌హెచ్‌ సారథి ప్యాట్ కమిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు.

Rishvik
Published on: 21 May 2026 8:11 PM IST
Pat Cummins
X

Pat Cummins: నేను కూడా చాలా డిజప్పాయింట్ అయ్యా.. ఎంఎస్ ధోనీ ఆరా వేరే లెవెల్!

Pat Cummins: క్రికెట్ దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) సారథి ప్యాట్ కమిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోనీ ఒక క్రికెట్ లెజెండ్ అని పేర్కొన్నాడు. సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌లో ధోనీ ఆడాలని తాను కూడా బలంగా కోరుకున్నాను అని, మహీ మైదానంలోకి దిగకపోవడంతో అభిమానులతో పాటు తాను కూడా డిజప్పాయింట్ అయ్యాను అని చెప్పాడు. చెపాక్‌లో ధోనీ ఆరా వేరే లెవెల్ అని కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2026లో ధోనీ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని విషయం తెలిసిందే.

మే 18న చెన్నైలోని చిదంబరం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. సీఎస్‌కే 20 ఓవర్లలో 7 వికెట్లకు 180 పరుగులు చేయగా.. హైదరాబాద్ 19 ఓవర్లలోనే 181/5 స్కోర్ చేసి విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ... 'మ్యాచ్‌కు ముందు ఎంఎస్ ధోనీ మా మీద ఆడాలని కోరుకున్నాను. కానీ చివరికి అతను ఆడలేదు. ధోనీ ఆడుంటే ఆ మ్యాచ్ ఇంకా స్పెషల్‌గా ఉండేది. ధోనీ ఒక క్రికెట్ లెజెండ్. చెపాక్‌లో అతను ఆడితే అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని ఆరా, అతనికి దక్కే గౌరవం పూర్తిగా భిన్నంగా ఉంటాయి' అని కొనియాడాడు.

'నా కెరీర్‌లో ఎంఎస్ ధోనీతో అదే చివరి మ్యాచ్ అయి ఉండొచ్చు. ఆ మ్యాచ్‌లో అతను ఆడుంటే నాకు ఇంకా ఎక్కువ ఆనందంగా ఉండేది, ధోనీ ఆడకపోవడంతో నేను చాలా నిరాశకు గురయ్యా. అభిమానుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకుంటాను. ధోనీ కోసం ఫాన్స్ ఆశగా ఎదురు చూశారు' అని ప్యాట్ కమిన్స్ చెప్పాడు. ప్రస్తుతం కమిన్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడైన ధోనీకి చెపాక్‌లో ప్రత్యేకమైన అభిమాన గణం ఉంది. అతను మైదానంలోకి దిగితే స్టేడియం మొత్తం ఒక్కసారిగా ఉత్సాహంతో మార్మోగిపోతుంది. అందుకే ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు కూడా ధోనీ ప్రభావాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ఓటమితో చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపుగా గల్లంతు అయ్యాయి. ఐపీఎల్ 2026లో నేడు సీఎస్‌కే లీగ్ దశలో చివరి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్‌ (జీటీ)తో అహ్మదాబాద్‌ వేదికగా తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో అయినా ఎంఎస్ ధోనీ ఆడతాడని ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ధోని అహ్మదాబాద్‌కు కాకుండా.. తన స్వస్థలం రాంచీ వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. సీఎస్‌కే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తే మాత్రమే మళ్లీ జట్టుతో కలుస్తాడని సమాచారం. ఈ మ్యాచ్లో ఓడితే సీఎస్‌కే అధికారికంగా ప్లేఆఫ్స్ నుంచి తప్పుకుంటుంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story