Pat Cummins: SRHకు గుడ్ న్యూస్.. మ్యాచ్ విన్నర్ వచ్చేస్తున్నాడు, ఇక డబిడదిబిడే!

Pat Cummins: మెదక్ జిల్లాలో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు.

Rishvik
Published on: 14 April 2026 7:17 PM IST
Pat Cummins
X

Pat Cummins: SRHకు గుడ్ న్యూస్.. మ్యాచ్ విన్నర్ వచ్చేస్తున్నాడు, ఇక డబిడదిబిడే!

Pat Cummins: సొంత మైదానంలో రాజస్థాన్ రాయల్స్‌ (ఆర్ఆర్)తో జరిగిన మ్యాచ్‌లో గెలిచి విజయానందంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌)కు గుడ్ న్యూస్. ఎస్‌ఆర్‌హెచ్‌ రెగ్యులర్ కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పాట్ కమిన్స్‌ త్వరలోనే జట్టుతో కలవనున్నాడు.

మ్యాచ్ విన్నర్ కమిన్స్‌ ఏప్రిల్ 17న సన్‌రైజర్స్ జట్టులో చేరనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఫిట్‌నెస్ సమస్యతో దూరంగా ఉన్న కమిన్స్ తిరిగి రావడం ఎస్‌ఆర్‌హెచ్‌కు పెద్ద బూస్ట్‌గా మారనుంది. అరంగేట్ర బౌలర్లు ప్రఫుల్ హింగే, సకిబ్ హుస్సేన్ మెరుపులకు కమిన్స్ రాకతో ‌మరింత బలం చేకూరనుంది.

పాట్ కమిన్స్ చివరిసారిగా ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఆడాడు. అనంతరం వెన్ను నొప్పి కారణంగా అన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు భారత్‌కు వచ్చినా.. ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేదు. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) పిలుపు మేరకు తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లి చికిత్స పొందాడు.

తాజా సమాచారం ప్రకారం.. కమిన్స్ బుధవారం (ఏప్రిల్ 15) ఆస్ట్రేలియాలో ఫిట్‌నెస్ టెస్ట్‌కు హాజరవుతాడు. ఆ టెస్ట్‌లో పాస్ అయితే త్వరలోనే ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టుకు అందుబాటులోకి రానున్నాడు. ఫ్రాంచైజీ వర్గాలు కమిన్స్ ఫిట్‌గా తిరిగి వస్తాడని ఆశిస్తున్నాయి. అన్ని సవ్యంగా జరిగితే ఏప్రిల్ 17న కమిన్స్ హైదరాబాద్‌కు చేరుకునే అవకాశం ఉంది.

పాట్ కమిన్స్ గైర్హాజరీలో ఇషాన్ కిషన్ ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టును నడిపిస్తున్నాడు. అతని సారథ్యంలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించిన ఎస్‌ఆర్‌హెచ్.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఫిట్‌నెస్ టెస్ట్‌ పాసై కమిన్స్ తిరిగి జట్టులో చేరితే బౌలింగ్ దళం మరింత బలపడనుంది. కమిన్స్ తన కెప్టెన్సీలో 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఫైనల్‌కు చేర్చాడు.

2016లో సన్‌రైజర్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. రెండో టైటిల్ కోసం సన్‌రైజర్స్ పదేళ్లుగా ఎదురుచూస్తోంది. డెక్కన్ ఛార్జర్స్ స్థానంలో 2013లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఐపీఎల్‌లో అడుగుపెట్టింది. శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్, కేన్ విల్లియంసన్ ఎస్‌ఆర్‌హెచ్‌ సారథులుగా చేశారు. ఇప్పుడు కమిన్స్ సారథ్యం వహిస్తున్నాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story