PKBS vs GT: టాస్‌ గెలిచిన పంజాబ్‌ కింగ్స్‌ జట్టు.. తుది జట్లు ఇవే!

PBKS vs GT playing XI: ఐపీఎల్ 2026లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ముల్లన్‌పూర్‌లోని మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మరికొద్ది సేపట్లో జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ తలపడనున్నాయి.

Rishvik
Published on: 31 March 2026 7:48 PM IST
PBKS vs GT IPL 2026
X

PBKS vs GT IPL 2026: Punjab Kings Win Toss, Opt to Bowl; Playing XI Revealed

PBKS vs GT playing XI: ఐపీఎల్ 2026లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ముల్లన్‌పూర్‌లోని మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మరికొద్ది సేపట్లో జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో గుజరాత్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. అందరి దృష్టి అయ్యర్, గిల్‌పైనే ఉంది. భారత టీ20 జట్టులో లేని ఈ ఇద్దరు.. ఐపీఎల్‌ 2026లో ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి.

పంజాబ్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌కు ఐపీఎల్ 2026లో ఇదే మొదటి మ్యాచ్. ఈ నేపథ్యంలో టోర్నీలో ఆరంభం చేయాలని ఇరు జట్లు చూస్తున్నాయి. గతేడాది శ్రేయస్‌ అయ్యర్ సారథ్యంలో ఫైనల్‌కు చేరుకున్న పంజాబ్‌.. ఈ సీజన్లో ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. అరంగేట్ర సీజన్లోనే (2022)లోనే టైటిల్‌ను అందుకుని గుజరాత్‌.. తర్వాతి ఏడాది రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోతోన్న గిల్ సేన ఈసారి టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగింది.

తుది జట్లు:

పంజాబ్ కింగ్స్‌: ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (కీపర్‌), కూపర్‌ కానెల్లీ, శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), నెహాల్‌ వధేరా, శశాంక్‌ సింగ్‌, మార్కస్‌ స్టోయినిస్‌, మార్కో యాన్సెన్‌, జేవియర్‌ బార్ట్‌లెట్‌, విజయ్‌ కుమార్‌ వైశాఖ్‌, అర్షదీప్‌ సింగ్‌, యుజ్వేంద్ర చహల్‌.

గుజరాత్‌ టైటాన్స్‌: సాయి సుదర్శన్‌, శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), జోస్‌ బట్లర్‌ (కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, ఎమ్‌ షారుఖ్‌ ఖాన్‌, రాహుల్‌ తెవాతియా, రషీద్‌ ఖాన్‌, కగిసో రబాడా, అశోక్‌ శర్మ, మహ్మద్‌ సిరాజ్‌.

ఇంపాక్ట్‌ సబ్‌సిట్యూట్స్‌:

పంజాబ్‌ కింగ్స్‌: ప్రియాంశ్‌ ఆర్య, హర్‌ప్రీత్‌ బ్రార్‌, ప్రవీణ్‌ దుబె, విష్ణు వినోద్‌, సూర్యాంశ్‌ షెడ్జ్‌.

గుజరాత్‌ టైటాన్స్‌: ప్రసిద్ధ్‌ కృష్ణ, జాసన్‌ హోల్డర్‌, జయంత్‌ యాదవ్‌, మానవ్‌ సుతార్‌, కుమార్‌ కుశాగ్ర.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story