Prabhsimran Singh: ప్రభ్‌సిమ్రన్‌ అరుదైన ఘనత.. ఐపీఎల్‌లో ఇలా మూడోసారి మాత్రమే!

Prabhsimran Singh: ఐపీఎల్‌లో కొందరు బ్యాట్స్‌మన్‌లు మాత్రమే ఒకే ఓవర్లో సిక్సుల లేదా ఫోర్లు బాదారు. తాజాగా పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ ఒకే ఓవర్లో ఆరు ఫోర్లు కొట్టాడు.

Rishvik
Published on: 25 April 2026 7:31 PM IST
Prabhsimran Singh
X

Prabhsimran Singh: ప్రభ్‌సిమ్రన్‌ అరుదైన ఘనత.. ఐపీఎల్‌లో ఇలా మూడోసారి మాత్రమే!

Prabhsimran Singh: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటేనే బ్యాట్స్‌మన్‌ల హవా ఉంటుంది. బ్యాటర్లు ఓ ఓవర్లో ఫోర్లు, సిక్సులు బాదుతుంటారు. అయితే ఒకే ఓవర్లో ఆరు సిక్సులు లేదా ఆరు ఫోర్లు బాదడం దాదాపుగా అసాధ్యం. కొందరు బ్యాట్స్‌మన్‌లు మాత్రమే ఒకే ఓవర్లో సిక్సుల లేదా ఫోర్లు బాదారు. దాంతో అరుదైన ఘనత ఖాతాలో వేసుకుంటారు. తాజాగా పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ ఒకే ఓవర్లో ఆరు ఫోర్లు కొట్టాడు. ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రన్‌ ఒకే ఓవర్లో ఆరు ఫోర్లు బాదాడు. ఐపీఎల్‌లో ఇలా జరగడం ఇది మూడోసారి మాత్రమే.

ఒకే ఓవర్లో ఆరు ఫోర్లు బాదటం చాలా అరుదైన ఘనతగా నిలుస్తుంది. బౌలర్‌పై పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తూ వరుసగా ఆరు బౌండరీలు కొట్టడం అంటే అసాధారణ ప్రతిభ కావాలి. ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఈ ఫీట్‌ను కేవలం ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే సాధించారు. ఈ అరుదైన రికార్డును మొదటిసారి 2012లో అజింక్య రహానే సాధించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఎస్ అరవింద్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో ఆరు ఫోర్లు బాది సంచలనం సృష్టించాడు. ఆ ఓవర్‌లో రహానే చూపించిన టైమింగ్, క్లాస్ ఇప్పటికీ అభిమానులు గుర్తు చేసుకుంటారు.

అజింక్య రహానే బాదిన 9 ఏళ్ల తర్వాత పృథ్వీ షా ఈ ఘనతను అందుకున్నాడు. 2021లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై జరిగిన మ్యాచ్‌లో శివమ్ మావి వేసిన ఓవర్‌లో తొలి ఓవర్లోనే ఆరు ఫోర్లు బాది మ్యాచ్‌కు మంచి మూమెంటమ్ సెట్ చేశాడు. పవర్‌ప్లేలో షా షాట్లకు అందరూ ఫిదా అయ్యారు. అలాంటి దూకుడు అరుదు అనే చెప్పాలి. ఐపీఎల్ 2026లో ఈ జాబితాలో ప్రభుసిమ్రన్ సింగ్ కూడా చేరాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై జరిగిన మ్యాచ్‌లో ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో ఆరు ఫోర్లు బాదాడు. అతని అటాకింగ్ బ్యాటింగ్ మ్యాచ్‌కు మలుపు తిప్పింది.

ఈ ముగ్గురు ఆటగాళ్లు సాధించిన ఈ ఘనత ఐపీఎల్‌లో బ్యాటింగ్ స్థాయిని మరోస్థాయికి తీసుకెళ్లింది. ఒకే ఓవర్లో వరుసగా ఆరు బౌండరీలు బాదటం అంటే కేవలం దూకుడు కాదు.. టైమింగ్, ప్లేస్‌మెంట్, ధైర్యం అన్నీ ఉంటేనే సాధ్యం. భవిష్యత్తులో మరెవరు ఈ రికార్డును చేరుతారో చూడాలి. ఇక ఐపీఎల్‌లో ఒకే ఒక్కడు ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాదాడు. 2025 మేలో ఈడెన్ గార్డెన్స్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఒకే ఓవర్‌లో వరుసగా ఆరు సిక్సర్లు కొట్టాడు. క్రిస్ గేల్, రాహుల్ తెవాటియా, రింకు సింగ్‌ల పేరిట ఉన్న వరుసగా ఐదు సిక్సర్ల రికార్డును అధిగమించాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story