ఏరికోరి తెస్తే, ఇట్టా పరువు తీసేశావేందయ్యా.. టీ20 క్రికెట్ హిస్టరీలోనే అత్యంత చెత్త రికార్డులో గంభీర్ శిష్యుడు!
worst bowling record: ఈ మ్యాచ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ వేసిన తన కోటా చివరి ఓవర్ (ఇన్నింగ్స్ 17వ ఓవర్) అభిమానులకు ఒక పీడకలలా మిగిలిపోయింది. ఆ ఓవర్లో ఐర్లాండ్ బ్యాటర్లు ప్రసిద్ధ్ కృష్ణను దారుణంగా టార్గెట్ చేశారు.
ఏరికోరి తెస్తే, ఇట్టా పరువు తీసేశావేందయ్యా.. టీ20 క్రికెట్ హిస్టరీలోనే అత్యంత చెత్త రికార్డులో గంభీర్ శిష్యుడు!
prasidh krishna unwanted record: ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. ఒకే ఓవర్లో ఏకంగా 27 పరుగులు సమర్పించుకోవడమే కాకుండా, వరుస టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న బౌలర్‌గా క్రికెట్ చరిత్రలోనే ఎవరూ కోరుకోని ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుని అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాడు.
ఆరంభంలో అదరగొట్టి.. ఆఖర్లో చేతులెత్తేసిన భారత్
బెల్ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ భారత బౌలర్లు మొదట్లో అద్భుతంగా రాణించారు. కేవలం 51 పరుగులకే 4 వికెట్లు పడగొట్టి ఐర్లాండ్‌ను కోలుకోలేని దెబ్బ తీశారు. అయితే, ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఐర్లాండ్ కెప్టెన్ లాక్రాన్ టక్కర్, గారెత్ డెలానీలు భారత బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ముఖ్యంగా ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఓవర్లు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాయి. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ఐర్లాండ్ భారీ స్కోరు సాధించడంలో ప్రసిద్ధ్ కృష్ణ ధారాళంగా ఇచ్చిన పరుగులే ప్రధాన కారణమయ్యాయి.
ఒకే ఓవర్లో సిక్సర్ల వర్షం.. బెంబేలెత్తిన ప్రసిద్ధ్ కృష్ణ..
ఈ మ్యాచ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ వేసిన తన కోటా చివరి ఓవర్ (ఇన్నింగ్స్ 17వ ఓవర్) అభిమానులకు ఒక పీడకలలా మిగిలిపోయింది. ఆ ఓవర్లో ఐర్లాండ్ బ్యాటర్లు ప్రసిద్ధ్ కృష్ణను దారుణంగా టార్గెట్ చేశారు. మొదటి మూడు బంతుల్లో రెండు ఫోర్లు కొట్టిన ఐర్లాండ్ బ్యాటర్లు, ఆ తర్వాతి మూడు బంతులను వరుసగా సిక్సర్లుగా మలిచారు. దీంతో ఆ ఒక్క ఓవర్లోనే ఏకంగా 27 పరుగులు వచ్చాయి. మొత్తం 4 ఓవర్లు వేసిన ప్రసిద్ధ్ కృష్ణ ఒక్క వికెట్ కూడా పడగొట్టకుండా 57 పరుగులు సమర్పించుకుని తీవ్ర విమర్శలపాలయ్యాడు.
టీ20 క్రికెట్ చరిత్రలోనే ఎరుగని అత్యంత అప్రతిష్టాత్మక రికార్డు..
ఈ పేలవ ప్రదర్శనతో ప్రసిద్ధ్ కృష్ణ అంతర్జాతీయ టీ20ల్లో పలు అప్రతిష్టాత్మక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా నిలిచాడు. గతంలో ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్‌లో 68 పరుగులు ఇచ్చిన ప్రసిద్ధ్, ఇప్పుడు ఐర్లాండ్‌పై 57 పరుగులు ఇచ్చాడు. అంటే కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే ఏకంగా 125 పరుగులు సమర్పించుకుని ప్రపంచ రికార్డు సృష్టించాడు. భారత్ తరఫున ఒక టీ20 మ్యాచ్‌లో అత్యంత ఖరీదైన బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన ఆటగాడిగా కూడా ప్రసిద్ధ్ కృష్ణ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
గాయం తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేసిన ప్రసిద్ధ్ కృష్ణకు ఈ మ్యాచ్ ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోనుంది. ఐపీఎల్‌లో అదరగొట్టిన ఈ పర్పుల్ క్యాప్ విజేత, అంతర్జాతీయ వేదికపై మాత్రం తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు కనిపిస్తోంది. రాబోయే మ్యాచ్‌ల్లో అయినా ప్రసిద్ధ్ కృష్ణ తన తప్పులను సరిదిద్దుకుని, లయ అందుకోవాలని భారత క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.




