చారిత్రాత్మక మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్.. 142 ఏళ్ల తర్వాత!

Pratika Rawal ruled out of Lord's Test. ఇంగ్లండ్‌తో చారిత్రాత్మక టెస్టుకు ముందు భారత మహిళల జట్టుకు భారీ షాక్ తగిలింది.

Rishvik
Updated on: 8 July 2026 10:41 PM IST
Pratika Rawal ruled out of Lords Test.
X

చారిత్రాత్మక మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్.. 142 ఏళ్ల తర్వాత!

Pratika Rawal ruled out of Lord's Test:ఇంగ్లండ్‌తో చారిత్రాత్మక టెస్టుకు ముందు భారత మహిళల జట్టుకు భారీ షాక్ తగిలింది. యువ ఓపెనర్ ప్రతికా రావల్ మోకాలి గాయంతో ప్రతిష్ఠాత్మక లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌కు దూరమైంది. శుక్రవారం (జూన్ 10) నుంచి ప్రారంభమయ్యే ఈ టెస్టు నుంచి గాయంతో ప్రతికా భారత మహిళల జట్టు హెడ్ కోచ్ అమోల్ మజుందార్‌ అధికారికంగా వెల్లడించారు. ప్రతికా స్థానంలో సీనియర్ బ్యాటర్ ప్రియా పునియాను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపారు.

ఈ నెల ప్రారంభంలో టాంటన్ వేదికగా జరిగిన ఇండియా-ఏ మ్యాచ్‌లో ప్రతికా రావల్ మోకాలికి తీవ్ర గాయం అయింది. మోకాలిపై లోతైన గాటు పడటంతో ఆమెకు కుట్లు కూడా పడ్డాయి. ఆ గాయం పూర్తిగా నయం కాలేదు. వైద్యుల సూచన మేరకు లార్డ్స్ టెస్టు నుంచి ఆమెను తప్పించినట్లు హెడ్ కోచ్ అమోల్ మజుందార్‌ చెప్పారు. ప్రతికా గాయపడటంతో ఆమె స్థానాన్ని ప్రియా పునియా భర్తీ చేయనుంది. ఇంగ్లండ్ పరిస్థితుల్లో ఇప్పటికే ఆడిన ప్రియా.. ఈ అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది. లార్డ్స్ వంటి చారిత్రాత్మక వేదికపై జరిగే మ్యాచ్‌ ఆమెకు ఎంతో కీలకంగా మారింది. ప్రియా మంచి ఇన్నింగ్స్ ఆడి జట్టులో తన స్థానాన్ని సుస్థిర పరుచుకోవాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.

ప్రతికా రావల్‌కు గాయాలు కావడం ఇదే తొలిసారి కాదు. గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ సందర్భంగా కూడా ఆమె చీలమండ గాయంతో టోర్నమెంట్ మొత్తానికి దూరమైంది. ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ప్రతికా.. మంచి ఆరంభం చేసినప్పటికీ మరోసారి గాయం కారణంగా కీలక మ్యాచ్‌లను ఆడలేదు. ఇప్పుడు మరోసారి గాయంతో ఇంగ్లండ్‌తో చారిత్రాత్మక టెస్టుకు కూడా దూరమైంది. ఇటీవలి గాయాలు ప్రతికాను వెంటాడుతున్నాయి.

ఇక లార్డ్స్ మైదానంలో మహిళల టెస్టు మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. పురుషుల తొలి టెస్టు జరిగిన 142 ఏళ్ల తర్వాత మహిళల టెస్టుకు ఈ చారిత్రాత్మక వేదిక ఆతిథ్యం ఇస్తోంది. అలాంటి ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌కు ముందు భారత జట్టులో కీలక ఓపెనర్ గాయంతో దూరం కావడం జట్టుకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. 142 ఏళ్ల తర్వాత మహిళల టెస్టు మ్యాచ్ జరుగుతుండడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీ20 ప్రపంచకప్ 2026లో విఫలమైన భారత జట్టు.. ఈ టెస్టులో విజయం సాదించాలని చూస్తోంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story