Priyansh Arya: ఎంతో స్టార్‌డమ్ ఉన్నా.. థర్డ్ ఏసీ రైలులో ట్రావెల్ చేసిన ఐపీఎల్ స్టార్!
Priyansh Arya: ఐపీఎల్ 2026లో ప్రియాంశ్ ఆర్య పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రియాంశ్ ఆటతీరు, నిలకడపై చిన్ననాటి కోచ్ సంజయ్ భరద్వాజ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
Priyansh Arya: ఎంతో స్టార్‌డమ్ ఉన్నా.. థర్డ్ ఏసీ రైలులో ట్రావెల్ చేసిన ఐపీఎల్ స్టార్!
Priyansh Arya: ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ జట్టు ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి ఎరుగకుండా కొనసాగుతోంది. 11 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
పీబీకేఎస్ విజయాల వెనుక ఓపెనింగ్ జోడీ ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరి దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లకు పెద్ద సవాలుగా మారారు. ప్రియాంశ్, ప్రభ్‌సిమ్రాన్ ఓపెనింగ్ కారణంగా పంజాబ్ భారీ స్కోర్ చేస్తోంది, అదే సమయంలో లక్షాన్ని కూడా చెడిస్తోంది. ఈ ఇద్దరిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రియాంశ్ ఆర్య 37 బంతుల్లో 93 పరుగులు చేసి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ప్రియాంశ్ ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, తొమ్మిది సిక్సులు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ 254/7 స్కోర్ నమోదు చేయడం విశేషం. ఇది ఈ సీజన్‌లోనే అత్యధిక టీమ్ స్కోర్‌గా నిలిచింది.
ఐపీఎల్ 2025లోనే అరంగేట్రం చేసిన ఆర్య అదరగొట్టాడు. ఆ సీజన్‌లో 17 మ్యాచ్‌ల్లో 475 పరుగులు చేసి ఔరా అనిపించాడు. 24 ఏళ్ల వయసులోనే ఈ స్థాయిలో రాణించడం మాటలు కాదు. అయితే ఒత్తిడిని సవాల్‌గా తీసుకుని ఈ సీజన్‌లో మరింత బలంగా తిరిగొచ్చాడు. ఐపీఎల్ 2026లో పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రియాంశ్ ఆటతీరు, నిలకడపై అతని చిన్ననాటి కోచ్ సంజయ్ భరద్వాజ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
'ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేస్తే స్టార్‌డమ్ వస్తుంది. రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతారు. అయితే స్టార్‌డమ్ వచ్చాక యువ ఆటగాళ్లు ఒత్తిడికి గురవుతారు. కానీ ప్రియాంశ్ ఆర్య మాత్రం ఎప్పటిలాగే సాధారణంగా ఉంటాడు. మా అకాడమీలో 70 మంది ఆటగాళ్లలో అతడు ఒకడు. ఐపీఎల్ ఆటగాడిననే భావన అతనిలో అస్సలు కనిపించదు.
అంతకుముందు ఎలా ఉన్నాడో, ఇప్పుడు అలానే ఉంటున్నాడు. ఇది నాకు కాస్త ఆశ్చర్యంగా అనిపంచింది. గత సీజన్ సక్సెస్ తర్వాత ఒత్తిడి పెరగకుండా ఉండేందుకు అన్ని దేవుడికే వదిలేశామని చెప్పా. ఐపీఎల్‌లో ఒత్తిడి సహజమే. ఒత్తిడి పెంచుకుంటే నిలకడగా రాణించడం కష్టం. జట్టు కోసం ఆడాలి.. వ్యక్తిగత ప్రదర్శన గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఆట దెబ్బతింటుందని సలహా ఇచ్చా' అని భరద్వాజ్ తెలిపాడు.
ప్రియాంశ్ ఆర్య వినయానికి నిదర్శనంగా ఒక సంఘటనను కూడా భరద్వాజ్ గుర్తుచేశాడు. ఒకసారి 28 బంతుల్లో సెంచరీ చేసిన మరుసటి రోజే క్లబ్ మ్యాచ్ కోసం పంజాబ్‌లోని మాన్సాకు థర్డ్ ఏసీ రైలులో పంపించానని వెల్లడించాడు. 'ఐపీఎల్ డబ్బు, పేరు అతడిని ఏమాత్రం ప్రభావితం చేయలేదు.
అదే అతని గొప్పతనం. వినయం ఉన్నవాడే విజయం సాధిస్తాడు' అని ఆయన అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ స్టార్‌డమ్ మధ్య కూడా అదేమీ లేనట్లు ముందుకు సాగుతున్న ప్రియాంశ్.. భవిష్యత్తులో భారత క్రికెట్‌కు కీలక ఆటగాడిగా ఎదిగే అవకాశం ఉంది.




