MI vs PBKS Playing 11: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్.. రోహిత్ అవుట్, రెండు మార్పులతో బరిలోకి ముంబై!
MI vs PBKS Playing 11: ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
MI vs PBKS Playing 11: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్.. రోహిత్ అవుట్, రెండు మార్పులతో బరిలోకి ముంబై!
MI vs PBKS Playing 11: ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ (ఎంఐ), పంజాబ్ కింగ్స్ (పీకేబీఎస్) మధ్య ఆసక్తికర మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ముంబై మొదట బ్యాటింగ్ చేయనుంది. టాస్ సందర్భంగా శ్రేయస్ మాటాడుతూ.. పిచ్ కొంచెం డ్రైగా కనిపిస్తున్నప్పటికీ రాత్రికి డ్యూ ప్రభావం పెరిగే అవకాశం ఉందని, అందుకే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నట్లు చెప్పాడు. జట్టు మంచి రిథమ్‌లో ఉందని, అదే మోమెంటమ్ కొనసాగించాలని చూస్తున్నామని పేర్కొన్నాడు.తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని శ్రేయస్ చెప్పాడు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడుతూ.. తాము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నామని, అయితే టాస్ ఓడినా మంచి క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. గత మ్యాచ్‌లో కొన్ని కీలక ఓవర్లలో ఎక్కువ పరుగులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఈ మ్యాచ్‌లో అలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపాడు. రోహిత్ శర్మ ఇంకా కోలుకుంటున్నాడని, మరికొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉండే అవకాశం ఉందని తెలిపాడు. మిచెల్ సాంట్నర్ కూడా అనారోగ్యంతో ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడని వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో క్వింటన్ డికాక్, మయాంక్ రావత్ ఆడుతున్నారని తెలిపాడు.
తుది జట్లు:
పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రన్ సింగ్ (కీపర్), ప్రియాంశ్ ఆర్య, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), కూపర్ కానెల్లీ, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో యాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్ కుమార్ వైశాఖ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్.
ముంబై ఇండియన్స్: క్వింటన్ డి కాక్ (కీపర్), ర్యాన్ రికెల్టన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), రూథర్ ఫోర్డ్, నమన్ ధిర్, మయాంక్ రావత్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రా.
ఇంపాక్ట్ ప్లేయర్స్:
పంజాబ్: నేహాల్ వధేరా, విష్ణు వినోద్, హర్‌ప్రీత్ బ్రార్, సుయాన్ష్ షెడ్జే, యశ్ ఠాకూర్.
ముంబై: ఏఎం ఘజన్‌ఫర్, కార్బిన్ బోష్, రాజ్ భావా, రాబిన్ మిన్జ్, అశ్వని కుమార్.




