PV Sindhu: సింధు కంటిపై విచిత్ర‌మైన గ్యాడ్జెట్‌.. ఇంత‌కీ ఏంటిది, ఎలా ప‌ని చేస్తుంది.?

PV Sindhu: ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ పీవి సింధు కేవ‌లం ఆట‌తోనే కాకుండా వ్య‌క్తిగ‌త జీవితంతో కూడా వార్త‌ల్లో నిలుస్తుంటారు.

Mokshith
Published on: 25 April 2026 2:39 PM IST
PV Sindhu
X

PV Sindhu

PV Sindhu: ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ పీవి సింధు కేవ‌లం ఆట‌తోనే కాకుండా వ్య‌క్తిగ‌త జీవితంతో కూడా వార్త‌ల్లో నిలుస్తుంటారు. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో ధ‌రించిన ఓ గ్యాడ్జెట్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఇంత‌కీ ఏంటా గ్యాడ్జెట్.? అది ఎలా ప‌నిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మ్యాచ్‌లో మెరిసిన సింధు.. గాడ్జెట్‌పై ఆసక్తి

పీవీ సింధు ఉబర్ కప్ 2026లో డెన్మార్క్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. మొదటి సింగిల్స్ మ్యాచ్‌లో ఆమె 21-13, 18-21, 21-17 స్కోర్‌తో విజయం సాధించి భారత జట్టుకు మంచి ఆరంభం అందించింది.

ఆ తర్వాత డబుల్స్‌లో కూడా తన భాగస్వామి తనిషా క్రాస్టోతో కలిసి మరో మ్యాచ్‌లో ఆడింది. అయితే ఈ మ్యాచ్‌ల కారణంగా ఆమెపై శారీరక ఒత్తిడి ఎక్కువగా పడింది. మ్యాచ్ అనంతరం ఆమె భుజం, మోకాళ్లపై ఐస్ ప్యాక్‌లు పెట్టుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో మరో విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె కంటి పక్కన ధరించిన చిన్న గాడ్జెట్ గురించి చ‌ర్చ మొద‌లైంది.

‘Temple’ గాడ్జెట్ అంటే ఏమిటి?

సింధు ధరించిన ఈ ప్రత్యేక పరికరం పేరు Temple. ఇది ఒక చిన్న wearable brain-tech డివైస్. దీన్ని Deepinder Goyal రూపొందించారు. ఇది చాలా చిన్నదిగా, దాదాపు ఒక ఇంచ్ పరిమాణంలో ఉంటుంది. ఈ డివైస్ బ్లూటూత్ అవసరం లేకుండా పనిచేస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 3 నుంచి 4 గంటల వరకు పనిచేస్తుంది. ప్రస్తుతం ఇది మార్కెట్‌లో అందుబాటులోకి రాలేదు. ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది.

ఈ డివైస్ పని ఏమిటి?

‘Temple’ డివైస్ ప్రధానంగా మెదడుకు సంబంధించిన సమాచారం ట్రాక్ చేస్తుంది. ముఖ్యంగా మెదడులో రక్త ప్రసరణ ఎలా జరుగుతోంది.? ఆక్సిజన్ స్థాయి ఎంత ఉంది.? ఇలాంటి విషయాలను రియల్ టైమ్‌లో కొలుస్తుంది. ఇది ఆటగాళ్ల ఫిట్‌నెస్, మెంటల్ ఫోకస్‌ను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది.

కాబట్టి సింధు ఈ డివైస్‌ను ఉపయోగించడం ద్వారా తన శారీరక, మానసిక స్థితిని ట్రాక్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది భవిష్యత్తులో క్రీడల్లో కొత్త టెక్నాలజీగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story