Vaibhav Sooryanvanshi: డ్రింక్స్ తీసుకెళ్లడం అవమానం కాదు.. వైభవ్ సూర్యవంశీ విమర్శలపై యాష్ కౌంటర్!

Vaibhav Sooryanvanshi: R Ashwin backs Vaibhav Sooryavanshi amid criticism.రవిచంద్రన్ అశ్విన్ మరోసారి వైభవ్‌కు మద్దతుగా నిలుస్తూ.. విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చాడు.

Rishvik
Published on: 1 July 2026 8:10 PM IST
Vaibhav Sooryanvanshi
X

Vaibhav Sooryanvanshi: డ్రింక్స్ తీసుకెళ్లడం అవమానం కాదు.. వైభవ్ సూర్యవంశీ విమర్శలపై యాష్ కౌంటర్!

Vaibhav Sooryanvanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత జట్టులో చోటు దక్కినా.. తుది జట్టులో మాత్రం అవకాశం రాలేదు. దీంతో అతడిని ఎందుకు ఆడించలేదనే చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నడుస్తోంది.

ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అయినా వైభవ్‌కు అరంగేట్రం దక్కుతుందా? అనే ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి వైభవ్‌కు మద్దతుగా నిలుస్తూ.. విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చాడు.

బయట కూర్చోవడంలో కూడా విలువ ఉంది:

ఐర్లాండ్ సిరీస్ అనంతరం తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన ఆర్ అశ్విన్.. యువ ఆటగాడు తుది జట్టులో లేకపోయినా జట్టుతో కలిసి ఉండటం ద్వారా ఎంతో నేర్చుకునే అవకాశం ఉంటుందని చెప్పాడు. 'బయట కూర్చొని మ్యాచ్‌ను గమనించడంలో కూడా విలువ ఉంది. జట్టుకు సహాయం చేయాలి.

అవసరమైతే డ్రింక్స్ కూడా తీసుకెళ్లాలి. ఆ అనుభవం ద్వారా చాలా విషయాలు నేర్చుకోవచ్చు' అని అశ్విన్ వ్యాఖ్యానించాడు. 'మొదట కొంతకాలం ప్లేయింగ్ ఎలెవన్‌కు దూరంగా ఉంటే జట్టు వాతావరణం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. సహచర ఆటగాళ్ల పట్ల మరింత అవగాహన పెరుగుతుంది. వైభవ్ కు సుదీర్ఘమైన కెరీర్ ఉంది. కాబట్టి బయట బెంచ్ మీద కూర్చోవడం కూడా ఒక బాధ్యతే' అని వివరించాడు.

విమర్శలపై అశ్విన్ ఘాటు సమాధానం:

ఆర్ అశ్విన్ వ్యాఖ్యలపై కొందరు అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. జట్టులోకి తీసుకుని ఆడించకపోతే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై తాజాగా స్పందించిన అశ్విన్.. వైభవ్ లాంటి ప్రతిభావంతుడికి సరైన సమయం ఇవ్వాలని కోరాడు. 'వైభవ్ సూర్యవంశీకి సమయం ఇవ్వాలి. ఐపీఎల్‌లో అతడు ఆడిన తీరు చూస్తే ఎప్పటికైనా భారత జట్టులో ఆడడం ఖాయం. అతడు అంత ప్రత్యేకమైన ఆటగాడు' అని అశ్విన్ పేర్కొన్నాడు.

డ్రింక్స్ మోయడం చిన్న విషయం కాదు:

డ్రింక్స్ తీసుకెళ్లడం అవమానకరం కాదని అశ్విన్ స్పష్టం చేశాడు. 'నేను చెప్పేది ఒక్కటే. డ్రింక్స్ మోయడం ఎలాంటి అవమానం కాదు. ఎందుకు కొందరు దాన్ని తక్కువగా చూస్తున్నారు?. క్రికెట్ సంస్కృతి ఎప్పుడు పూర్తిగా మారిపోయింది?. 1990, 2000 దశకాల్లో నేను చెన్నైలో బాల్ బాయ్‌గా పనిచేశాను. అప్పట్లో భారత ఆటగాళ్లకు నీళ్లు తీసుకెళ్లడం నాకు ఎంతో గర్వంగా అనిపించేది. భారత క్రికెటర్లకు వాటర్ బాటిల్ అందించడం ఎప్పటి నుంచి చిన్న విషయంగా మారిపోయింది?' అంటూ అశ్విన్ విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story