Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్ విజయ సంబరాలపై నీళ్లు.. ఆ కారణంతోనే!
Rajasthan Royals: లక్నోపై 40 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం సాధించింది. కానీ నంద్రే బర్గర్ ప్రవర్తన మాత్రం చర్చనీయాంశమైంది. బర్గర్ ప్రవర్తనకు జరిమానా విధించారు.
Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్ విజయ సంబరాలపై నీళ్లు.. ఆ కారణంతోనే!
Rajasthan Royals: ఐపీఎల్ 2026 సీజన్‌లోని 32వ లీగ్ మ్యాచ్ లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 40 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ విజయం అనంతరం, ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్ నంద్రే బర్గర్‌కు మ్యాచ్ ఫీజు జరిమానాతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా విధించారు.
పంత్ వికెట్ తీసిన తర్వాత
లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్, 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి కేవలం 159 పరుగులు మాత్రమే చేసింది. దాంతో విజయభారం వారి బౌలర్లపై పడింది, వారు అద్భుతంగా రాణించి LSG జట్టును 18 ఓవర్లలో 119 పరుగులకే పరిమితం చేశారు. అందరి దృష్టి లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌పైనే ఉంది. ఈ క్రమంలోనే నంద్రే బర్గర్ బౌలింగ్ లో పంత్ డకౌట్ అయ్యాడు.ఆ సమయంలో బర్గర్ పంత్ కి వెటకారంగా సెండ్ ఆఫ్ సైగ చేశాడు.దీంతో బర్గర్, ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి 2.5 కింద లెవెల్ 1 నిబంధనను ఉల్లంఘించడంతో, అతని మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానాతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా అందుకున్నాడు.
రెండు ఓటముల పరంపరకు ముగింపు
రియాన్ పరాగ్ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇప్పటివరకు మైదానంలో అద్భుతంగా రాణించి, వరుసగా తమ మొదటి నాలుగు మ్యాచ్‌లను గెలుచుకుంది. దీని తర్వాత, లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండు ఓటములను చవిచూడటంతో, ఈ మ్యాచ్ వారికి కీలకంగా మారింది.
ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ భారీ విజయాన్ని సాధించడమే కాకుండా, ఏడు మ్యాచ్‌ల నుండి 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి చేరుకుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తమ తదుపరి మ్యాచ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుంది, గత మ్యాచ్‌లో ఆ జట్టు చేతిలో 57 పరుగుల తేడాతో ఓడిపోయింది.




