అతడు ఐర్లాండ్ బౌలర్ల ప్యాంట్ ఊడదీసేవాడు.. టీమిండియా పెద్ద తప్పిదం చేసింది!
Ravi Shastri: Ravi Shastri on Vaibhav Sooryavanshi Debut. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం అవకాశం ఇవ్వకపోవడంపై రవిశాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేశాడు.
అతడు ఐర్లాండ్ బౌలర్ల ప్యాంట్ ఊడదీసేవాడు.. టీమిండియా పెద్ద తప్పిదం చేసింది!
Ravi Shastri: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఇప్పటివరకు అంతర్జాతీయ అరంగేట్రం అవకాశం ఇవ్వకపోవడంపై టీమిండియా మాజీ హెడ్ కోచ్, మాజీ ప్లేయర్ రవిశాస్త్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20లు, ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో కూడా బెంచ్‌కే పరిమితమైన 15 ఏళ్ల వైభవ్‌కు ఇప్పటికే అవకాశం ఇవ్వాల్సిందని స్పష్టం చేశాడు. ముఖ్యంగా ఐర్లాండ్ సిరీస్‌లో అతడిని ఆడించకపోవడం జట్టు యాజమాన్యం చేసిన పెద్ద తప్పిదమని పేర్కొన్నాడు. బుడ్డోడిని ఆడించి ఉంటే.. ఐర్లాండ్ బౌలర్ల ప్యాంట్ ఊడదీసేవాడని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.
సిరీస్ ఓడిపోవడంతో విమర్శలు:
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేశాడు. 16 మ్యాచులలో 776 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టు విజయంలోనూ కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత ప్రదర్శనలతో భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. మంచి ఫామ్ మీదున్న బుడ్డోడికి ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌లు, ఇంగ్లండ్‌తో తొలి టీ20లో తుది జట్టులో అవకాశం దక్కలేదు. దాంతో అభిమానులతో పాటు మాజీలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐర్లాండ్‌పై సిరీస్ ఓడిపోవడంతో ఈ విమర్శలు మరింత ఎక్కువ్వయ్యాయి.
బౌలర్ల ప్యాంట్ ఊడదీసేవాడు:
బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన తర్వాత సోనీ స్పోర్ట్స్‌లో మాట్లాడిన రవిశాస్త్రి.. వైభవ్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై తీవ్రంగా స్పందించాడు. 'అరే.. అతడిని ఐర్లాండ్‌పై తప్పకుండా ఆడించాల్సింది. అక్కడి పిచ్ నెమ్మదిగా ఉండేది. మైదానం కూడా చాలా చిన్నది. అలాంటి పరిస్థితుల్లో వైభవ్ బంతులను స్టాండ్లలోకి పంపించేవాడు. ఐర్లాండ్ బౌలర్ల ప్యాంట్ ఊడదీసేవాడు.
అతడికి అప్పుడే అవకాశం ఇవ్వాల్సింది. ఇప్పుడు ఇంగ్లండ్‌లో అవకాశం ఇస్తారో లేదో తెలియదు. కానీ వీలైనంత త్వరగా అతడిని ఆడించాలి' అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. వైభవ్ ప్రతిభ గురించి కూడా శాస్త్రి ప్రశంసలు కురిపించాడు. 'ఐపీఎల్‌లో వైభవ్ ప్రపంచ స్థాయి బౌలర్లందరినీ చితక్కొట్టాడు. ఏ ఫాస్ట్ బౌలర్‌ను వదిలిపెట్టాడు? చెప్పండి. అలాంటి ఆటగాడిని బెంచ్‌పై కూర్చోబెట్టడం ఆశ్చర్యంగా ఉంది' అని అన్నాడు.
వైభవ్ 'ఎక్స్ ఫ్యాక్టర్':
అంతేకాకుండా భారత జట్టుకు వైభవ్ 'ఎక్స్ ఫ్యాక్టర్'గా మారగలడని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. 'వైభవ్ సూర్యవంశీకి ఎలాంటి ఒత్తిడి లేదు. కేవలం 15 ఏళ్ల వయసే. యువతకు ఉండే ధైర్యం, నిర్భయంగా ఆడే స్వభావం అతడిలో ఉన్నాయి. తొలి రెండు లేదా మూడు ఓవర్లలోనే దూకుడుగా ఆడితే జట్టుకు అద్భుతమైన ఆరంభం అందించగలడు. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ మరింత స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుంది.
అలాంటి ఆటగాడికి జట్టులో స్థానం కల్పించాల్సిందే' అని పేర్కొన్నాడు. భారత్-ఇంగ్లండ్ మధ్యస్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్ జూలై 4న మాంచెస్టర్ వేదికగా జరగనుంది. తొలి మ్యాచ్ వర్షంతో రద్దవడంతో ఈ మ్యాచ్‌లో సూర్యవంశీకి అరంగేట్రం అవకాశం దక్కుతుందా? లేక మరోసారి బెంచ్‌కే పరిమితం అవుతాడా? అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.




