Ashwin IPL Retirement: ఇంకొంత కాలం ఐపీఎల్‌లో ఆడేవాణ్ని, అంతా చెన్నై వల్లే.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు!

Ashwin on IPL Retirement: ఆర్ అశ్విన్‌ తన ఐపీఎల్ రిటైర్మెంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీఎస్‌కేకు ఆడుతున్న సమయంలో మానసికంగా అశాంతికి గురైనాను అని చెప్పాడు.

Rishvik
Updated on: 7 April 2026 12:09 PM IST
Ashwin IPL Retirement
X

Ashwin IPL Retirement: ఇంకొంత కాలం ఐపీఎల్‌లో ఆడేవాణ్ని, అంతా చెన్నై వల్లే.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు!

Ashwin IPL Retirement: భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ తన ఐపీఎల్ రిటైర్మెంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) తరఫున ఆడిన అనుభవం తనకు చాలా బాధ కలిగించిందని చెప్పాడు. సీఎస్‌కేకు ఆడుతున్న సమయంలో మానసికంగా అశాంతికి గురై ఉండకపోతే.. ఇంకొంతకాలం ఐపీఎల్‌లో కొనసాగేవాడినని యాష్ స్పష్టం చేశాడు. 2024లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ఇచ్చిన అశ్విన్‌.. 2025 సీజన్ అనంతరం ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు. అశ్విన్‌ ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు తన యూట్యూబ్ ఛానల్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో సీఎస్‌కే దారుణ ప్రదర్శన చేస్తోంది. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోవడంతో జట్టు పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో అట్టడుగున్న ఉన్న చెన్నై.. ఇకపై వరుస విజయాలు సాధిస్తేనే ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమి చెందడంతో సీఎస్‌కేపై విమర్శలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆర్ అశ్విన్ జట్టు ఓటములపై స్పందించాడు. అదే సమయంలో తన రిటైర్మెంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నిజానికి నేను ఇంకా ఐపీఎల్‌లో ఆడేవాణ్ని. కానీ 2025 సీజన్‌ చాలా నిరాశాజనకంగా సాగింది. వ్యక్తిగతంగా నాకు నిరాశ కలిగింది. మిగతా పనులూ చూసుకుంటూ క్రికెట్ ఆడే మానసిక శక్తి లేదు. అందుకే తప్పుకున్నా' అని తన యూట్యూబ్ ఛానల్‌లో యాష్ చెప్పాడు.

తాను స్వయంగా రిటైర్మెంట్ ప్రకటించడం ద్వారా జట్టు మేనేజ్‌మెంట్‌కు ఇబ్బంది లేకుండా చేశానని అశ్విన్ తెలిపాడు. 'నన్ను రిటైన్ చేయాలా లేదా రిలీజ్ చేయాలా అనే టెన్షన్ వారికి ఉండకూడదనుకున్నాను. దాంతో పాటు వారు రూ.10 కోట్లు కూడా సేవ్ చేసుకున్నారు' అని అశ్విన్ సరదాగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుత సీఎస్‌కే ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. యువ ఆటగాళ్లపై నమ్మకం పెట్టుకున్నప్పటికీ.. వారికి సరైన మార్గదర్శకత్వం, ప్రాక్టీస్ వాతావరణం ఇవ్వడం లేదని విమర్శించారు. 'ఈ యువ ఆటగాళ్లకు మంచి ట్రైనింగ్, ఇంటెన్సిటీ ఇవ్వాలి. అప్పుడే వారు మెరుగ్గా రాణిస్తారు' అని యాష్ పేర్కొన్నాడు. జామీ ఓవర్టన్ వంటి బౌలర్లను యార్కర్లు వేయమని ఒత్తిడి చేయడం సరైంది కాదని, అది అతడి బలం కాదని చెప్పుకొచ్చాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story