IPL 2026-RCB: టాప్-5లో నాలుగు స్థానాలు ఏంది బ్రో.. ఆర్సీబీకే ఇంత క్రేజ్ ఎందుకు మామ!
IPL 2026-RCB: ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యధికంగా వీక్షించిన మ్యాచ్‌ల జాబితాలో మొదటి స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ నిలిచింది.
IPL 2026-RCB: టాప్-5లో నాలుగు స్థానాలు ఏంది బ్రో.. ఆర్సీబీకే ఇంత క్రేజ్ ఎందుకు మామ!
IPL 2026-RCB: ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. టోర్నీ ఆరంభం నుంచే మ్యాచ్‌లు ఉత్కంఠతకు గురి చేస్తున్నాయి. లీగ్ దశలో దాదాపుగా సగం మ్యాచ్‌లు ప్లేఆఫ్స్ రేస్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఐపీఎల్ 2026లో క్రికెట్ అభిమానుల ఉత్సాహం మరోస్థాయికి చేరింది. ప్రతి మ్యాచ్ కూడా భారీగా ప్రేక్షకాదరణ దక్కుతోంది. కొన్ని మ్యాచ్‌లు మాత్రం రికార్డు స్థాయిలో వ్యూస్ సాధిస్తున్నాయి. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఆడిన మ్యాచ్‌లు అత్యధిక వ్యూస్ సాధించడం విశేషం. ఆ జాబితాలో ఏంటో ఓసారి చూద్దాం.
ఈ సీజన్‌లో అత్యధికంగా వీక్షించిన మ్యాచ్‌ల జాబితాలో మొదటి స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ నిలిచింది. ఈ మ్యాచ్‌ను 426 మిలియన్ మంది వీక్షించారు. అదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ 410 మిలియన్ వ్యూస్ సాధించి రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ (406 మిలియన్) ఉండగా.. నాలుగో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ (355 మిలియన్) నిలిచింది. ఈ జాబితాలో ఆర్సీబీ మ్యాచ్‌లు ఎక్కువగా ఉండటం ఆ జట్టు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను స్పష్టంగా చూపిస్తోంది.
ఇక ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ 351 మిలియన్ వ్యూస్‌తో ఐదో స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ 307 మిలియన్ వ్యూస్ సాధించి ఆరవ స్థానంలో నిలిచింది. మిగిలిన స్థానాల్లో చెన్నై సూపర్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (283 మిలియన్), రాజస్థాన్ రాయల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (280 మిలియన్), చెన్నై సూపర్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ (279 మిలియన్), రాజస్థాన్ రాయల్స్ vs ముంబై ఇండియన్స్ (278 మిలియన్) మ్యాచ్‌లు ఉన్నాయి. ఐపీఎల్ 2026లో ప్రేక్షకుల ఆసక్తి మరింత పెరిగినట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా బెంగళూరు,చెన్నై, ముంబై వంటి జట్లకు ఉన్న భారీ ఫ్యాన్ బేస్ వల్ల ఆ ప్రాంచైజీ మ్యాచ్‌లు టాప్‌లో నిలుస్తున్నాయి.
ఐపీఎల్ 2026లో అత్యధికంగా వీక్షించిన టాప్ 10 మ్యాచ్‌లు:
1. ఆర్సీబీ vs ఎస్‌ఆర్‌హెచ్ - 426 మిలియన్లు
2. ఆర్‌ఆర్ vs ఆర్సీబీ - 410 మిలియన్లు
3. ఎంఐ vs ఆర్సీబీ- 406 మిలియన్లు
4. ఆర్సీబీ vs సీఎస్‌కే - 355 మిలియన్లు
5. ఎంఐ vs కేకేఆర్ - 351 మిలియన్లు
6. సీఎస్‌కే vs పీబీకేఎస్ - 307 మిలియన్లు
7. సీఎస్‌కే vs డీసీ - 283 మిలియన్లు
8. ఆర్‌ఆర్ vs సీఎస్‌కే - 280 మిలియన్లు
9. సీఎస్‌కే vs కేకేఆర్ - 279 మిలియన్లు
10. ఆర్‌ఆర్ vs ఎంఐ - 278 మిలియన్లు




