RCB-IPL 2026: ఆర్సీబీకి భారీ షాక్.. స్టార్ ప్లేయర్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం?
Tim David To Faces Two-Match Ban. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో కీలక సమయంలో ఆర్సీబీకి బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి.
RCB-IPL 2026
RCB-IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్లేఆఫ్స్ దిశగా దూసుకెళుతోంది. 11 మ్యాచులలో 7 విజయాలతో 14 పాయింట్స్ ఖాతాలో వేసుకుంది. మరో రెండు విజయాలు సాధిస్తే అధికారిక బెర్త్ దక్కడమే కాకుండా.. టాప్ 2లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ కీలక సమయంలో ఆర్సీబీకి బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ అనంతరం ఆర్సీబీ స్టార్ ఫినిషర్ టిమ్ డేవిడ్ చేసుకున్న సెలబ్రేషన్స్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
చివరి ఓవర్‌లో ఆర్సీబీ విజయానికి 15 రన్స్ అవసరం అయ్యాయి. మూడో బంతికే రొమారియో షెఫర్డ్ పెవిలియన్ చేరడంతో చేరడంతో ముంబై ఇండియన్స్ డగౌట్‌లో అందరూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇక మ్యాచ్ ముంబైదే అనుకున్న సమయంలో రాజ్ బవా వేసిన తర్వాతి భువనేశ్వర్ కుమార్ సిక్స్ కొట్టాడు. అప్పుడు ఆర్సీబీ డగౌట్‌లో జోష్ వచ్చేసింది. అందరూ చప్పట్లు కొట్టగా.. టిమ్ డేవిడ్ మాత్రం కుర్చీలో నుంచి లేచి రెండు చేతుల మిడిల్ ఫింగర్స్ చూపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు డేవిడ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన జరిగిందా అనే అంశంపై మ్యాచ్ అధికారులు సమీక్షిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అతడికి రెండు మ్యాచ్‌ల నిషేధం విధిస్తే.. ప్లేఆఫ్స్ రేసులో ఉన్న ఆర్సీబీకి అది భారీ దెబ్బ కావచ్చు. కీలక దశలో ఫినిషర్‌ను కోల్పోవడం జట్టు సమతౌల్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే ఈ అంశంపై స్పష్టత రానుంది.
అయితే ఆర్సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్‌పై మాత్రం ఇప్పటికే ఐపీఎల్ అధికారులు జరిమానా విధించారు. మ్యాచ్ సందర్భంగా నాలుగో అంపైర్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగినందుకు అతడిపై మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.3ను ఉల్లంఘించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఆర్టికల్ ప్రకారం.. ప్రేక్షకులు లేదా టీవీ వీక్షకులకు వినిపించే విధంగా అసభ్య పదజాలం ఉపయోగించడం నిబంధనలకు విరుద్ధం. మ్యాచ్ రిఫరీ అమిత్ శర్మ విధించిన శిక్షను ఆండీ ఫ్లవర్ అంగీకరించాడు. ఈ వివాదాస్పద ఘటన 17.2 ఓవర్లో చోటుచేసుకుంది. కృనాల్ పాండ్య బౌండరీ లైన్ వద్దకు కొట్టిన షాట్‌పై అంపైర్ల నిర్ణయంపై ఆండీ ఫ్లవర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. నమన్ ధీర్ బౌండరీ వద్ద క్యాచ్ పట్టే ప్రయత్నంలో బంతిని తిలక్ వర్మ వైపు నెట్టాడు. తొలుత అది సిక్స్‌గా భావించినా.. రీప్లేలో బౌండరీ కుషన్‌ను తాకలేదని తేలింది. దీంతో బంతిని డాట్ బాల్‌గా ప్రకటించారు. ఈ నిర్ణయంపై ఫ్లవర్ తీవ్రంగా స్పందించాడు.




