RCB vs DC: సబ్స్‌ పోరాటం, మ్యాచ్‌ను లాగేసిన మిల్లర్.. ఢిల్లీదే విజయం!

RCB vs DC: ఐపీఎల్ 2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమిని చవిచూసింది.

Rishvik
Published on: 18 April 2026 8:11 PM IST
RCB vs DC
X

RCB vs DC: సబ్స్‌ పోరాటం, మ్యాచ్‌ను లాగేసిన మిల్లర్.. ఢిల్లీదే విజయం!

RCB vs DC: సొంత మైదానంలో వందో మ్యాచ్ ఆడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు షాక్ తగిలింది. ఐపీఎల్ 2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఓటమిని చవిచూసింది. ఆర్సీబీ నిర్ధేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని మరో బంతి ఉండగానే 4 వికెట్స్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఢిల్లీ విజయంలో లోకేష్ రాహుల్ (57), ట్రిస్టన్‌ సబ్స్‌ (60 నాటౌట్), అక్షర్ పటేల్ (18/2, 26), విడ్ మిల్లర్ (22) కీలక పాత్ర పోషించారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3, కృనాల్ పాండ్య ఒక వికెట్ తీశారు.

176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి భువనేశ్వర్ కుమార్ భారీ షాకిచ్చాడు. ఓపెనర్ పాతుమ్ నిశ్శంక (1), కరుణ్ నాయర్ (5), సమీర్ రిజ్వీ (2)లను పెవిలియన్ పంపాడు. ఈ సమయంలో కేఎల్ రాహుల్ (57; 34 బంతుల్లో), ట్రిస్టన్‌ సబ్స్‌ జట్టును ఆదుకున్నారు. ఈ క్రమంలో రాహుల్ అద్భుత హాఫ్ సెంచరీ చేశాడు. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

రాహుల్ అవుటైన తర్వాత స్టబ్స్ బాధ్యత తీసుకున్నాడు. అక్షర్ పటేల్ (26) గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. అక్షర్ బయటికి వెళ్లాక మిల్లర్ క్రీజులోకి వచ్చాడు. చివరి 2 ఓవర్లలో ఢిల్లీ విజయానికి 25 పరుగులు కావాల్సి వచ్చింది. 19వ ఓవర్ వేసిన రసిక్ 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఢిల్లీపై ఒత్తిడి పెంచాడు. దాంతో ఆఖరి ఓవర్లో 15 పరుగులు అవసరమయ్యాయి.

షెపర్డ్ వేసిన ఆఖరి ఓవర్లో తొలి రెండు బంతులకు 2 పరుగులే వచ్చాయి. దాంతో ఢిల్లీ ఓటమి ఖాయం అనుకున్నారు. కానీ మిల్లర్ కిల్లర్ సిక్సులు బాదాడు. 3వ, 4వ బంతికి వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది ఒక్కసారిగా మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఇక ఐదవ బంతికి ఫోర్ బాది ఢిల్లీకి ఊహించని విజయం అందించాడు.

తొలుత ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (63;) రాణించాడు. ఓ దశలో పటిష్ట స్థితిలో కనిపించిన ఆర్సీబీ.. తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి తక్కువ స్కోరుకే పరిమితమైంది. టిమ్ డేవిడ్ (26), విరాట్ కోహ్లీ (19), పడిక్కల్ (18), జితేశ్‌ (14), కృనాల్ పాండ్య (12), రజత్ పటిదార్ (8) పరుగులు చేశారు. దిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడి, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్‌ రెండేసి వికెట్లు తీశారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story