RCB vs LSG: అభిమానులకు షాక్.. విరాట్ కోహ్లీ అవుట్, స్టార్ ప్లేయర్ ఇన్.. తుది జట్లు ఇవే!

RCB vs LSG: ఐపీఎల్ 2026లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు మరికొద్ది సేపట్లో తలపడనున్నాయి.

Rishvik
Published on: 15 April 2026 7:38 PM IST
RCB vs LSG
X

RCB vs LSG: అభిమానులకు షాక్.. విరాట్ కోహ్లీ అవుట్, స్టార్ ప్లేయర్ ఇన్.. తుది జట్లు ఇవే!

RCB vs LSG: ఐపీఎల్ 2026లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు మరికొద్ది సేపట్లో తలపడనున్నాయి. ఈ కీలక పోరులో టాస్ గెలిచిన ఆర్‌సీబీ కెప్టెన్ రజత్‌ పాటిదార్‌ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో లక్నో మొదట బ్యాటింగ్ చేయనుంది.

బెంగళూరు తుది జట్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లేడు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా కింగ్ బరిలోకి దిగనున్నాడు. మరోవైపు జాకబ్ డఫీ స్థానంలో స్టార్ పేసర్ జోష్‌ హేజిల్‌వుడ్‌ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. లక్నో తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ మ్యాచులో ఆడుతాడనుకున్న మయాంక్ యాదవ్‌ కూడా ఇంపాక్ట్‌ ప్లేయర్‌ లిస్టులో ఉన్నాడు.

లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ.. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని చెప్పాడు. మొదట బ్యాటింగ్ చేసినా లేదా బౌలింగ్ చేసినా పెద్ద తేడా ఉండదని, మంచి క్రికెట్ ఆడిన జట్టే గెలుస్తుందని పేర్కొన్నాడు. ప్లేయర్స్ అందరూ బాధ్యత తీసుకుని మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం ఉందని పంత్ పేర్కొన్నాడు. మరోవైపు పాటిదార్‌ మాట్లాడుతూ.. పిచ్ బాగా ఉందని, ముందుగా బౌలింగ్ చేసి ప్రత్యర్థిపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపాడు. గత మ్యాచ్‌తో పోలిస్తే ఈ పిచ్‌పై పచ్చిక తక్కువగా ఉందని, బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉందన్నాడు.

తుది జట్లు:

లక్నో సూపర్‌ జెయింట్స్‌: ఐడెన్‌ మార్‌క్రమ్‌, మిచెల్‌ మార్ష్‌, రిషభ్‌ పంత్‌ (కీపర్‌, కెప్టెన్‌), నికోలస్‌ పూరన్‌, ఆయుష్‌ బదోని, అబ్దుల్‌ సమద్‌, ముకుల్‌ చౌదరి, మహమ్మద్‌ షమీ, అవేశ్‌ ఖాన్‌, దిగ్వేశ్‌ సింగ్‌ రాఠీ, ప్రిన్స్‌ యాదవ్‌.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: ఫిల్‌ సాల్ట్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, రజత్‌ పాటిదార్‌ (కెప్టెన్‌), జితేశ్‌ శర్మ (కీపర్‌), టిమ్‌ డేవిడ్‌, రొమారియో షెఫర్డ్‌, కృనాల్‌ పాండ్య, భువనేశ్వర్‌ కుమార్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌, సుయాశ్‌ శర్మ, సలామ్‌ దార్‌.

ఇంపాక్ట్‌ ప్లేయర్స్:

లక్నో: మణిమారన్‌ సిద్ధార్థ్‌, జార్జి లిండే, మ్యాథ్యూ బ్రీట్జ్కే, హిమ్మత్‌ సింగ్‌, మయాంక్ యాదవ్‌.

బెంగళూరు: విరాట్‌ కోహ్లి, వెంకటేశ్‌ అయ్యర్‌, జోర్డాన్‌ కాక్స్‌, కాన్షిక్‌ చౌహాన్‌, మంగేశ్‌ యాదవ్‌.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story