RCB Lucky Charm: నువ్వు ఏ టీమ్‌లో ఉంటే ఆ టీమ్‌దే కప్ సామి
RCB Lucky Charm: క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ ఏ టీమ్‌లో ఉంటే ఆ టీమ్ కప్ గెలుస్తుందనే సెంటిమెంట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
RCB Lucky Charm: నువ్వు ఏ టీమ్‌లో ఉంటే ఆ టీమ్‌దే కప్ సామి
RCB Lucky Charm: క్రికెట్ ప్రపంచంలో కొందరి ఆట రికార్డులను తిరగరాస్తే.. మరికొందరి ఉనికి జట్టు తలరాతనే మార్చేస్తుంది. ఒకప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. భువనేశ్వర్ కుమార్ ఏ జట్టులోకి వెళ్తే ఆ జట్టు ఐపీఎల్ ఛాంపియన్‌గా అవతరిస్తోందనే కొత్త సెంటిమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వరుసగా రెండుసార్లు ఆర్సీబీ కప్ గెలవడంతో భువిని క్రికెట్ ప్రపంచం రియల్ లక్కీ చార్మ్ అని పిలుస్తోంది.
భువనేశ్వర్ కుమార్ కెరీర్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఉన్న బంధం అత్యంత ప్రత్యేకమైనది. 2016వ సంవత్సరంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తన తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్నప్పుడు ఆ జట్టు బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపించింది భువనేశ్వర్ కుమారే. ఆ సీజన్లో పర్పల్ క్యాప్ గెలవడమే కాకుండా, ఒత్తిడి సమయాల్లో అద్భుతంగా బౌలింగ్ చేసి హైదరాబాద్‌కు ఐపీఎల్ కప్‌ను అందించాడు. భువి జట్టులో ఉంటే ప్రత్యర్థులకు వణుకే అని ఆనాడే నిరూపితమైంది.
ఈ క్రమంలోనే ఐపీఎల్ మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం పక్కా ప్లానింగ్‌తో భువనేశ్వర్ కుమార్‌ను భారీ ధరతో సొంతం చేసుకుంది. దశాబ్దాలుగా కప్ కోసం ఎదురుచూస్తున్న ఆర్సీబీ అభిమానుల ఆశలను భువి ఏమాత్రం వమ్ము చేయలేదు. భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీ జట్టులోకి అడుగుపెట్టడమే ఒక అద్భుతంగా మారితే.. ఆ వెంటనే జట్టు వరుసగా విజయ శిఖరాలను అధిరోహించడం ప్రారంభించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన రీతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండుసార్లు ఛాంపియన్లుగా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించింది. ఒకప్పుడు ఈసాలా కప్ నమ్దే అంటూ ట్రోల్స్ ఎదుర్కొన్న జట్టు.. భువి రాకతో వరుస విజయాలతో దూసుకుపోయింది.
జోష్ హేజిల్‌వుడ్, రసిఖ్ సలామ్ వంటి యువ ,అంతర్జాతీయ పేసర్లకు వెన్నుదన్నుగా నిలుస్తూ భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీ బౌలింగ్ లైనప్‌ను ఒక పవర్‌హౌస్‌గా మార్చేశాడు. డెత్ ఓవర్లలో భువి వేసే యార్కర్లు, పవర్‌ప్లేలో చేసే స్వింగ్ మ్యాజిక్ ఆర్సీబీని వరుసగా రెండు సీజన్లలో విజేతగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాయి. భువి ఉంటే కప్ గ్యారెంటీ అనే మాట కేవలం ఒక సెంటిమెంట్ మాత్రమే కాదు, మైదానంలో అతను చూపించే అనుభవం, ప్రశాంతత జట్టు విజయానికి దోహదపడిందని చెప్పడంటో ఎటువంటి అనుమానం లేదు.




