Guinness Record: ఏడాదిలో 1,207 సినిమాలు..కట్ చేస్తే.. గిన్నిస్ రికార్డు కొట్టిన 60 ఏళ్ల రిటైర్డ్ ఆఫీసర్!
Guinness Record: అమెరికాలో 60 ఏళ్ల గ్లెన్‌వుడ్ హోస్కిన్ ఏడాదిలో 1,207 సినిమాలు థియేటర్లలో చూసి గిన్నిస్ రికార్డు సాధించారు.
Guinness Record: ఏడాదిలో 1,207 సినిమాలు..కట్ చేస్తే.. గిన్నిస్ రికార్డు కొట్టిన 60 ఏళ్ల రిటైర్డ్ ఆఫీసర్!
Guinness Record: అమెరికాలో రిటైర్డ్ ఆఫీసర్ గ్లెన్‌వుడ్ హోస్కిన్ జూనియర్ (60) గిన్నిస్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నారు. ఏడాదిలో రికార్డు స్థాయిలో 1,207 సినిమాలు థియేటర్లలో వీక్షించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకటించింది. అంటే సగటున రోజుకు 3.3 సినిమాలు చూశారు. ఏప్రిల్ 2024 నుంచి ఏప్రిల్ 2025 మధ్యకాలంలో పెన్సిల్వేనియాలోని యార్క్ హెవెన్‌లో స్థానిక థియేటర్ స్క్రీన్లలో ఈ ఫీట్ సాధించారు.
ఆయన ఈ రికార్డు కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతున్నప్పుడు ఈ ఛాలెంజ్ గురించి తెలుసుకున్నారు. ఇంతకుముందు ఈ రికార్డు జాకరియా స్వోప్ పేరిట ఉంది. ఆయన 777 సినిమాలు చూశారు. హోస్కిన్ ఆ రికార్డును అవలీలగా అధిగమించారు. గిన్నిస్ నిబంధనల ప్రకారం ప్రతి సినిమాను పూర్తిగా, వేరే ఏ పనీ చేయకుండా చూడాలి.
పెన్సిల్వేనియాలో ఆ ఏడాది శీతాకాలం తేలికగా ఉండటంతో ఊహించిన దానికంటే ఎక్కువ సినిమాలు చూడగలిగానని ఆయన చెప్పారు. థియేటర్‌లో ఏర్పడిన దినచర్య, స్నేహభావం కూడా తనకు నచ్చాయని తెలిపారు.
హోస్కిన్‌కు చిన్నప్పటి నుంచే సంగీతం, సినిమాలంటే ఎంతో ఇష్టం. ఒకే సినిమాను ఎక్కువ సార్లు థియేటర్లలో చూసిన రికార్డు గురించి కూడా ఆయన ఆలోచించారు. ఆ రికార్డు రామిరో అలానిస్ పేరిట ఉంది. ఆయన 'స్పైడర్‌మ్యాన్: నో వే హోమ్'ను 292 సార్లు చూశారు. అయితే తన థియేటర్‌లో సినిమాలు త్వరగా స్ట్రీమింగ్‌కు వెళ్లిపోవడంతో ఆ సంఖ్యను అందుకోలేకపోయానని హోస్కిన్ తెలిపారు. దీంతో ఏడాదిలో ఎక్కువ సినిమాలు చూసే రికార్డుపైనే దృష్టి పెట్టారు.




