SRH vs PBKS : క్లాసెన్ క్యాచ్ డ్రాప్.. పంజాబ్ కొంపముంచిన శశాంక్ సింగ్.. రికీ పాంటింగ్ రియాక్షన్ వైరల్
SRH vs PBKS : ఐపీఎల్ 2026లో శశాంక్ సింగ్ సులభమైన క్యాచ్‌ను వదిలేయడంతో పంజాబ్ కింగ్స్ కోచ్ రికీ పాంటింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ricky Ponting
SRH vs PBKS : ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరిగిన పోరులో ఆటగాళ్ల మెరుపులే కాదు, ఒక పొరపాటు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ శశాంక్ సింగ్ లడ్డూ లాంటి క్యాచ్‌ను వదిలేయడం మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. ఈ క్యాచ్ డ్రాప్ చూసి పంజాబ్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 9వ ఓవర్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. యుజ్వేంద్ర చాహల్ వేసిన ఓవర్ నాలుగో బంతికి స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ స్వీప్ షాట్ ఆడబోయాడు. అది నేరుగా బౌండరీ లైన్ వద్ద నిలబడిన శశాంక్ సింగ్ చేతుల్లోకి వెళ్ళింది. అది పట్టుకోవడం చాలా ఈజీ. కానీ శశాంక్ సింగ్ దాన్ని సరిగ్గా అంచనా వేయలేక నేలపాలు చేయడమే కాకుండా, అది బౌండరీకి వెళ్లేలా చూశాడు. అప్పటికి క్లాసెన్ తక్కువ స్కోరు వద్ద ఉన్నాడు. ఆ లైఫ్ లైన్ వాడుకున్న క్లాసెన్ 43 బంతుల్లో 69 పరుగులు చేసి హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
శశాంక్ సింగ్ క్యాచ్ వదిలేయగానే కెమెరాలు పంజాబ్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ వైపు వెళ్లాయి. సాధారణంగానే అగ్రెసివ్ గా ఉండే పాంటింగ్, ఈ లడ్డూ లాంటి క్యాచ్ డ్రాప్ చూసి తీవ్ర అసహనానికి లోనయ్యాడు. డగౌట్‌లో కూర్చున్న ఆయన ముఖంలో కోపం స్పష్టంగా కనిపించింది. గతంలో కూడా శశాంక్ సింగ్ ఫీల్డింగ్ లో తప్పులు చేయడంతో జట్టు నుంచి పక్కన పెట్టారు. తిరిగి హైదరాబాద్‌తో మ్యాచ్‌లో అవకాశం ఇస్తే, మళ్ళీ అదే తప్పు చేయడంతో పాంటింగ్ సహనాన్ని కోల్పోయారు. ఈ రియాక్షన్ ఇప్పుడు మీమ్స్ రూపంలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
Well well well, it's that man again! 🙊👀
— Star Sports (@StarSportsIndia) May 6, 2026
Shashank Singh has dropped yet another catch down, and #PBKS camp is in utter disbelief! 🥲#TATAIPL Revenge Week 2026 ➡️ #SRHvPBKS | LIVE NOW 👉https://t.co/4Te1XilHXg pic.twitter.com/lSVDGKfiBg
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరును బోర్డుపై పెట్టింది. క్లాసెన్ 69 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 55 పరుగులు బాదాడు. చివర్లో నితీష్ రెడ్డి కూడా కేవలం 13 బంతుల్లో 29 పరుగులు చేసి స్కోరును 230 దాటించాడు. పంజాబ్ బౌలర్లలో చాహల్ వికెట్ తీసే అవకాశం వచ్చినా ఫీల్డర్ల సహకారం లేకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.




