Rishabh Pant: పంత్.. ఆ ఎస్‌ఆర్‌హెచ్ స్టార్‌ను చూసి నేర్చుకో బాగుపడతావ్!
Rishabh Pant: రిషభ్ పంత్ వైట్‌బాల్ క్రికెట్‌లో తిరిగి జట్టులో స్థానం సంపాదించుకోవడానికి మరింత కష్టపడాల్సిన అవసరం ఉంది.
Rishabh Pant: పంత్.. ఆ ఎస్‌ఆర్‌హెచ్ స్టార్‌ను చూసి నేర్చుకో బాగుపడతావ్!
Rishabh Pant: భారత స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ వైట్‌బాల్ క్రికెట్‌లో (వన్డే, టీ20) తిరిగి జట్టులో స్థానం సంపాదించుకోవడానికి మరింత కష్టపడాల్సిన అవసరం ఉందని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ఒకప్పుడు ఎంఎస్ ధోనీ వారసుడిగా భావించిన పంత్.. గత రెండేళ్లుగా భారత వన్డే, టీ20 జట్లకు దూరంగా ఉన్నాడు. ఇటీవల టెస్టు జట్టులో చోటు దక్కినా.. వైస్ కెప్టెన్ బాధ్యతలను కోల్పోయాడు. బీసీసీఐ సెలెక్టర్లు కేఎల్ రాహుల్‌కు ఆ బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా 2027 వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడం పంత్‌కు కష్టమేనని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో జియోస్టార్‌తో మాట్లాడిన ఇర్ఫాన్ పఠాన్.. రిషభ్ పంత్‌కు సలహా ఇచ్చాడు. యువ వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించాడు. రెండేళ్లకు పైగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్.. దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనతో తిరిగి భారత జట్టులో చోటు సంపాదించుకున్నాడని గుర్తు చేశాడు. గత ఏడాది ఝార్ఖండ్ జట్టును తొలిసారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేతగా నిలిపిన ఇషాన్.. ఐపీఎల్ 2026లో కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేశాడని పేర్కొన్నాడు. అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌కు భారత జట్టులో కేఎల్ రాహుల్, ఇషాన్‌లను వికెట్‌కీపర్ బ్యాటర్లుగా ఎంపిక చేసిన విషయాన్ని గుర్తుచేశాడు.
లోకేష్ రాహుల్ ప్రస్తుతం భారత జట్టు తొలి ఎంపిక వికెట్‌కీపర్ అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పాడు. 'కేఎల్ రాహుల్ ఐదో, ఆరో స్థానాల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడు బహుముఖ టాలెంట్ కలిగిన ఆటగాడు. బ్యాకప్‌గా ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేయడం తెలివైన నిర్ణయం. అతడు టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగలడు. షార్ట్ బాల్స్‌ను కూడా సమర్థంగా ఎదుర్కొంటాడు. మూడో వికెట్‌కీపర్ ఎంపికలో సంజూ శాంసన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. సంజూకు అవకాశం వచ్చిన ప్రతిసారి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో కూడా అతని ప్రదర్శన అందరికీ గుర్తుంది' అని చెప్పాడు.
అయితే రిషభ్ పంత్‌ను పూర్తిగా పక్కన పెట్టవద్దని భారత సెలెక్టర్లకు ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. 'ప్రస్తుతం వైట్‌బాల్ క్రికెట్‌లో పంత్ వెనుకబడ్డాడు. అతని ఫామ్ కూడా ఆశించిన స్థాయిలో లేదు. కానీ ఇషాన్ కిషన్‌ను చూడండి. అతడూ జట్టుకు దూరమయ్యాడు. అయితే దానిని ప్రేరణగా తీసుకుని దేశవాళీ క్రికెట్‌లో రాణించాడు. ఝార్ఖండ్‌కు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు. అదే విధంగా పంత్ కూడా ఇషాన్ నుంచి స్ఫూర్తి పొందాలి.
కష్టపడి ఆడుతూ తిరిగి జట్టులోకి రావాలనే నమ్మకాన్ని కోల్పోవద్దు' అని పఠాన్ సూచించాడు. పంత్ లాంటి ప్రతిభావంతుడైన ఆటగాడికి తిరిగి జాతీయ జట్టులోకి వచ్చే సామర్థ్యం ఉందని, అయితే అందుకోసం దేశవాళీ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం భారత జట్టులో వికెట్‌కీపర్ స్థానం కోసం పోటీ తీవ్రంగా ఉండటంతో పంత్‌కు రాబోయే రోజులు కీలకంగా మారనున్నాయి.




