Riyan Parag: ఊహించని షాక్.. రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్‌పై బీసీసీఐ కఠిన చర్యలు!

Riyan Parag: పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో వేప్ (ఈ-సిగరెట్‌) ఉపయోగిస్తూ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ కెమెరాకు చిక్కాడు.

Rishvik
Published on: 30 April 2026 5:12 PM IST
Riyan Parag
X

Riyan Parag: ఊహించని షాక్.. రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్‌పై బీసీసీఐ కఠిన చర్యలు!

Riyan Parag: ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) కెప్టెన్ రియాన్ పరాగ్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో వేప్ (ఈ-సిగరెట్‌) ఉపయోగిస్తూ కెమెరాకు చిక్కాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఘటనపై అభిమానులు మండిపడ్డారు. వెంటనే రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బీసీసీఐని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ చర్యలు తీసుకుంది.

ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్‌ 1ను ఉల్లంఘించినందుకు గాను రియాన్ పరాగ్‌ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాగా బీసీసీఐ విధించింది. అంతేకాదు అతడి ఖాతాలో ఒక డీమరిట్ పాయింట్ చేర్చింది. క్రీడా ప్రతిష్టను దెబ్బతీసే ప్రవర్తన కింద ఈ చర్యలు తీసుకున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. పరాగ్ తన తప్పును అంగీకరించి మ్యాచ్ రిఫరీ అమిత్ శర్మ విధించిన శిక్షను స్వీకరించాడు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా ఉండాలని బీసీసీఐ అతడికి హెచ్చరిక కూడా జారీ చేసింది. మరోవైపు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సంబంధిత వర్గాలకు బీసీసీఐ సూచించింది.

భారతదేశంలో ఈ-సిగరెట్లపై ఉన్న కఠిన చట్టాలే ఈ ఘటన ఇంతలా హైలెట్ అవ్వడానికి కారణం. 2019లో అమల్లోకి వచ్చిన పెక చట్టం ప్రకారం.. వేప్స్ ఉత్పత్తి, విక్రయం, వినియోగం పూర్తిగా నిషేధించబడ్డాయి. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు, జైలు శిక్షలు కూడా విధించే అవకాశం ఉంది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఏడాది జైలు శిక్ష లేదా రూ.లక్ష జరిమానాకు గురవుతారు. ఏఈ నేపథ్యంలోనే రియాన్ పరాగ్‌ విషయంలో స్వయంగా బీసీసీఐ రంగంలోకి దిగి కఠిన చర్యలకు పూనుకుంది. ఈ ఘటన కేవలం క్రీడా క్రమశిక్షణ సమస్య మాత్రమే కాకుండా.. చట్టపరమైన అంశంగానూ మారింది.

ఈ ఘటనతో ఐపీఎల్ ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండేందుకు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. జట్టు, ఆటగాళ్లు, అధికారులు బాధ్యతగా ప్రవర్తించాలని బోర్డు స్పష్టం చేసింది. రియాన్ పరాగ్‌ వేపింగ్‌ వ్యవహారంపై ఇంకా రాజస్థాన్‌ రాయల్స్ యాజమాన్యం స్పందించలేదు. మరోవైపు పరాగ్‌ కూడా తన తప్పుపై స్పందించాలి ఉంది. పరాగ్‌ సారథ్యంలో ఐపీఎల్ 2026లో రాజస్థాన్ దూసుకెళుతోంది. ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడి ఆరు విజయాలతో పట్టికలో నాలుగో స్థానములో ఉంది. మిగిలిన ఐదు మ్యాచులలో రెండు గెలిస్తే ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story