Riyan Parag: డ్రెస్సింగ్ రూమ్‌లో స్మోకింగ్ చేసిన రియాన్ పరాగ్.. ఎలాంటి శిక్ష పడనుంది?
Riyan Parag: ఐపీఎల్ 2026 సమయంలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చ మొదలైంది.
Riyan Parag: డ్రెస్సింగ్ రూమ్‌లో స్మోకింగ్ చేసిన రియాన్ పరాగ్.. ఎలాంటి శిక్ష పడనుంది?
Riyan Parag: ఐపీఎల్ 2026 సమయంలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చ మొదలైంది. ఈ వీడియోలో ఆయన డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్ (ఈ సిగరెట్) చేస్తున్నట్టుగా కనిపించడంతో చట్టపరంగా, ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఏం జరుగుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వైరల్ వీడియోతో పెరిగిన వివాదం
రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న రియాన్ పరాగ్, పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్ చేస్తున్నట్టు వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవడంతో అభిమానులు, నిపుణులు దీనిపై చర్చిస్తున్నారు. అయితే ఈ వీడియో నిజమా కాదా అన్నది ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు.
భారత చట్టం ఏమంటోంది?
భారతదేశంలో The Prohibition of Electronic Cigarettes Act, 2019 ప్రకారం ఈ-సిగరెట్లు (వేపింగ్) పూర్తిగా నిషేధం. ఎవరు వాడినా, అమ్మినా, నిల్వ ఉంచినా అది నేరంగా పరిగణిస్తారు. మొదటిసారి తప్పు చేస్తే 1 సంవత్సరం జైలు లేదా రూ. 1 లక్ష జరిమానా. మళ్లీ చేస్తే 3 సంవత్సరాల జైలు లేదా రూ. 5 లక్షల వరకు జరిమానా విధిస్తారు.
IPL, BCCI నిబంధనలు
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా నియమాల ప్రకారం డ్రెస్సింగ్ రూమ్‌లో పొగాకు ఉత్పత్తులు పూర్తిగా నిషేధం. అందులో వేపింగ్ కూడా వస్తుంది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఆటగాడిపై జరిమానా లేదా ఇతర చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఇంకా స్పష్టత రాలేదు
అయితే ఈ వీడియోపై ఇప్పటివరకు ఐపీఎల్ నిర్వాహకులు లేదా బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వీడియో నిజమా, ఎడిట్ చేశారా అనే చర్చ సైతం జరుగుతోంది. కాబట్టి ప్రస్తుతం రియాన్ పరాగ్‌పై ఎలాంటి చర్యలు ఉంటాయో అనేది పూర్తిగా అధికారిక ధృవీకరణపై ఆధారపడి ఉంటుంది.




