Rohit Sharma: రోహిత్ శ‌ర్మ గాయంపై కీల‌క అప్డేట్‌.. ముంబై ఫ్యాన్స్‌కి పండ‌గే, కానీ

Rohit Sharma: రోహిత్ శ‌ర్మ గాయానికి సంబంధించి తాజాగా వ‌చ్చిన స‌మాచారం ముంబై ఇండియ‌న్‌ అభిమానులకు జోష్ నింపుఓంది.

Mokshith
Updated on: 15 April 2026 4:56 PM IST
Rohit Sharma
X

Rohit Sharma

Rohit Sharma: రోహిత్ శ‌ర్మ గాయానికి సంబంధించి తాజాగా వ‌చ్చిన స‌మాచారం ముంబై ఇండియ‌న్‌ అభిమానులకు జోష్ నింపుఓంది. రోహిత్ శ‌ర్మ త్వ‌ర‌లోనే కోలుకుంటాడ‌నే సంకేతాలు రావ‌డం ఆ జ‌ట్టుకు సైతం ఊపునిస్తోంద‌ని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఆర్సీబీ మ్యాచ్‌లో ఏమైంది?

ఏప్రిల్ 12న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ మంచి టచ్‌లో కనిపించాడు. అయితే 13 బంతుల్లో 19 పరుగులు చేసిన తర్వాత అకస్మాత్తుగా కండరాలు పట్టేయడంతో ఇన్నింగ్స్ మధ్యలోనే మైదానం విడిచాడు. అతను రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడం మ్యాచ్‌పై ప్రభావం చూపింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో ముంబై జట్టు చివరకు లక్ష్యానికి దగ్గరగా వెళ్లినా విజయం అందుకోలేకపోయింది.

మెడికల్ రిపోర్ట్‌లో ఏముంది?

గాయం తీవ్రతపై మొదట అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే స్కానింగ్ చేసిన వైద్య బృందం స్పష్టత ఇచ్చింది. కండరాల్లో ఎలాంటి చీలిక లేదని రిపోర్ట్ తెలిపింది. ఇది పెద్ద ఉపశమనం. అంటే దీర్ఘకాలం దూరంగా ఉండాల్సిన పరిస్థితి లేదని అర్థం. తాత్కాలిక కండరాల సమస్య మాత్రమే అని తేలడంతో జట్టు మేనేజ్‌మెంట్ కూడా ఊపిరి పీల్చుకుంది.

పంజాబ్ మ్యాచ్‌కు ఆడతాడా?

గురువారం (రేపు) జ‌ర‌గ‌బోయే పంజాబ్ కింగ్స్‌ మ్యాచ్‌లో రోహిత్ ఆడుతాడా అనే ప్రశ్న ఇంకా క్లారిటీకి రాలేదు. ఫిట్‌నెస్ టెస్ట్ తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు. పూర్తిగా ఫిట్ కాకపోతే అతడికి విశ్రాంతి ఇచ్చే అవ‌కాశం ఉంది. అవసరమైతే ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించే ఆప్షన్ కూడా పరిశీలనలో ఉంది.

ముంబై ఇండియన్స్ పరిస్థితి ఎలా ఉంది?

ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. నాలుగు మ్యాచ్‌లలో ఒకే విజయం నమోదు చేయగలిగింది. ప్లేఆఫ్స్ ఆశలు నిలుపుకోవాలంటే ఇకపై ప్రతి మ్యాచ్ కీలకంగా మారింది. ఈ దశలో రోహిత్ ఫిట్‌నెస్ జట్టుకు అత్యంత ముఖ్యమైన అంశంగా మారింది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story