RR vs DC: టాస్ గెలిచిన రాజస్థాన్.. కీలక మార్పులతో బరిలోకి ఇరు జట్లు!
RR vs DC: ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మరికొద్దిసేపట్లో మ్యాచ్ జరగనుంది.
RR vs DC: టాస్ గెలిచిన రాజస్థాన్.. కీలక మార్పులతో బరిలోకి ఇరు జట్లు!
RR vs DC: ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మరికొద్దిసేపట్లో మ్యాచ్ జరగనుంది. ఈ కీలక పోరులో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఇరు జట్లు కూడా కీలక మార్పులతో బరిలోకి దిగుతున్న ఈ మ్యాచ్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్లే ఆఫ్స్ రేస్ దృష్ట్యా ఈ మ్యాచ్ రెండు జట్లకూ అత్యంత కీలకంగా మారింది.
టాస్ సందర్భంగా రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. 'ఇది సాధారణ జైపూర్ పిచ్‌లా లేదు. కొంచెం డ్రైగా, ప్యాచ్‌లా కనిపిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ నెమ్మదిగా మారే అవకాశం ఉందని భావించి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నా. ఇటీవల భారీ లక్ష్యాలను ఛేజ్ చేయడం జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో పూర్తి స్థాయి ప్రదర్శన ఇవ్వాలని ఆశిస్తున్నాం. రవి బిష్ణోయ్, శుభమ్ దూబే జట్టులోకి వచ్చారు' అని చెప్పాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. 'మేము కూడా ఛేజ్ చేయడానికి సంతోషంగా ఉన్నాము. పిచ్ బాగానే కనిపిస్తోంది. బౌలర్లకు కొంత సహకారం దక్కనుంది. జట్టులో కొన్ని మార్పులు చేశాం. మిచెల్ స్టార్క్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అలాగే పాథమ్ నిస్సాంకా ఆడుతున్నాడు. డేవిడ్ మిల్లర్ బెంచ్‌కు పరిమితమయ్యాడు. ప్రస్తుత పరిస్థితుల్లో బేసిక్స్‌పై దృష్టి పెట్టి పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఆడడం ముఖ్యం' అని పేర్కొన్నాడు. మ్యాచ్ సందర్భంగా అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ, మిచెల్ స్టార్క్ పోరుపై ఉంది. ఇద్దరిలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
తుది జట్లు:
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేల్ (కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), ఫెర్రీరా, రవీంద్ర జడేజా, శుభమ్ దూబె, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, నాంద్రే బర్గర్, బ్రిజేశ్ శర్మ.
ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్ (కీపర్), పాథుమ్ నిశాంక, నితీశ్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (కెప్టెన్), అశుతోష్ శర్మ, కైల్ జెమీసన్, మిచెల్ స్టార్క్, కుల్‌దీప్ యాదవ్, టి నటరాజన్ .
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్:
రాజస్థాన్: ఆడమ్ మిల్నే, డాసున్ శనక, రవి సింగ్, యశ్ రాజ్ పుంజా, తుషార్ దేశ్ పాండే.
ఢిల్లీ: డేవిడ్ మిల్లర్, విప్రజ్ నిగమ్, కరుణ్ నాయర్, అభిషేక్ పోరెల్, అకిబ్ నబీ దార్.




