Rajasthan Royals : పాయింట్ల పట్టికలో దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్

Rajasthan Royals: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది.

Naresh.k
Published on: 8 April 2026 8:39 AM IST
Rajasthan Royals
X

Rajasthan Royals : పాయింట్ల పట్టికలో దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్

RR vs MI: ఐపీఎల్ 2026లో భాగంగా గువహటి వేదికగా జరిగిన హై-వోల్టేజ్ పోరులో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. వర్షం అంతరాయం కలిగించినా, మ్యాచ్ ఉత్కంఠకు ఏమాత్రం కొదవ లేకుండా సాగింది. ముంబై ఇండియన్స్‌ను 27 పరుగుల తేడాతో చిత్తు చేసి రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో దూసుకుపోయింది.

జైస్వాల్ వీరవిహారం

వర్షం కారణంగా మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించడంతో, రాజస్థాన్ బ్యాటర్లు ఆది నుంచే ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (77) అజేయ హాఫ్ సెంచరీతో ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. యువ సంచలనం సూర్యవంశీ (39), స్థానిక హీరో రియాన్ పరాగ్ (20) మెరుపులు మెరిపించడంతో రాజస్థాన్ నిర్ణీత 11 ఓవర్లలో 150 పరుగుల భారీ స్కోరు సాధించింది.

కట్టడి చేసిన రాజస్థాన్

151 పరుగుల క్లిష్టమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు రాజస్థాన్ బౌలర్లు చాన్సే ఇవ్వలేదు. ముంబై బ్యాటర్లలో రూథర్‌ఫోర్డ్ (25), నమన్ ధీర్ (25) పోరాడినా ఫలితం లేకపోయింది. రాజస్థాన్ బౌలర్లు నంద్రీ బర్గర్, రవి బిష్ణోయ్, సందీప్ శర్మ తలా రెండు వికెట్లతో ముంబై వెన్ను విరిచారు. జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే చెరో వికెట్ తీసి విజయాన్ని ఖాయం చేశారు. నిర్ణీత ఓవర్లలో ముంబై 123 పరుగులకే పరిమితమై, 9 వికెట్లు కోల్పోయింది.

Naresh.k

Naresh.k

Next Story