Starc vs Yashasvi Jaiswal: ప్రతిసారి పెవిలియన్‌కే.. స్టార్క్ అంటేనే హడలిపోతున్న జైస్వాల్!

ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్, భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మధ్య పోరు క్రికెట్ అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తుంది.

Rishvik
Published on: 1 May 2026 10:23 PM IST
Starc vs Yashasvi Jaiswal
X

Starc vs Yashasvi Jaiswal

ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్, భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మధ్య పోరు క్రికెట్ అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే ఈ ద్వంద్వ పోరులో ఇప్పటివరకు స్టార్క్ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించాడు. ప్రపంచ స్థాయి పేసర్‌గా గుర్తింపు పొందిన స్టార్క్.. తన వేగం, స్వింగ్‌తో జైస్వాల్‌ను పలుమార్లు బోల్తా కొట్టించాడు. తాజాగా ఐపీఎల్ 2026లో కూడా స్టార్క్ ముందు జైస్వాల్ తలొంచక తప్పలేదు. స్టార్క్ vs జైస్వాల్ ముఖాముఖీ గణాంకాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

పెర్త్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ రెండు ఇన్నింగ్స్‌లలో 0(8), 161(297) స్కోర్లు నమోదు చేశాడు. ఇందులో ఒకసారి భారీ సెంచరీ చేసినప్పటికీ.. మరోసారి డక్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ డకౌట్ చేశాడు. అడిలైడ్‌ టెస్టులో 0(8)లోనూ ఔటయ్యాడు. గబ్బాలో 4(2), మెల్బోర్న్‌లో 22(35), 10(26)లలో తక్కువ స్కోర్లకే పరిమితమయ్యాడు. తాజాగా జైపూర్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కూడా 6(3) పరుగులకే స్టార్క్ బౌలింగ్‌లో జైస్వాల్ పెవిలియన్ చేరాడు. ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ స్టార్క్‌ వేసిన ఇన్నింగ్స్ మూడో బంతికి అవుట్ అయ్యాడు. ఫుల్‌టాస్‌ బంతికి అతడికే రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి జైస్వాల్‌ వెనుదిరిగాడు.

ఈ గణాంకాలు చూస్తే యశస్వి జైస్వాల్‌పై మిచెల్ స్టార్క్ ఎంతటి ప్రణాళికాబద్ధంగా బౌలింగ్ చేస్తున్నాడో అర్థమవుతోంది. ముఖ్యంగా కొత్త బంతితో స్టార్క్ స్వింగ్, బౌన్స్ జైస్వాల్‌కు పెద్ద సవాల్‌గా మారుతున్నాయి. జైస్వాల్ అటాకింగ్ ఆటగాడైనా.. స్టార్క్ లాంటి అనుభవజ్ఞుడైన బౌలర్‌ను ఎదుర్కోవడంలో కొన్ని సందర్భాల్లో తడబడుతున్నాడు. అయితే జైస్వాల్ ప్రతిభను తక్కువ అంచనా వేయలేం. ఒకవైపు స్టార్క్ ఆధిపత్యం కనిపిస్తున్నప్పటికీ.. మరోవైపు పెర్త్‌లో అతడు సాధించిన 161 పరుగుల భారీ ఇన్నింగ్స్ అతని సామర్థ్యాన్ని చాటిచెబుతోంది. భవిష్యత్తులో ఈ పోరు మరింత ఆసక్తికరంగా మారే అవకాశముంది. జైస్వాల్ తన లోపాలను సరిదిద్దుకుని స్టార్క్‌పై తిరిగి ఆధిపత్యం సాధిస్తాడా? లేదా స్టార్క్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తాడా? అన్నది చూడాలి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story