Ruturaj Gaikwad Trolls: ఇంకా జట్టులో ఎందుకు?.. అతడిని వెంటనే తీసేయండి సార్!

Ruturaj Gaikwad Trolls: ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్‌ తీవ్రంగా నిరాశపర్చుతున్నాడు. 7 మ్యాచ్‌ల్లో 104 పరుగులు మాత్రమే సాధించాడు.

Rishvik
Published on: 23 April 2026 9:03 PM IST
Ruturaj Gaikwad Trolls
X

Ruturaj Gaikwad Trolls: ఇంకా జట్టులో ఎందుకు?.. అతడిని వెంటనే తీసేయండి సార్!

Ruturaj Gaikwad Trolls: ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్‌ తీవ్రంగా నిరాశపర్చుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో పెద్దగా ప్రభావం చూపని గైక్వాడ్‌.. ఈరోజు వాంఖడేలో ముంబై ఇండియన్స్‌పై చెలరేగుతాడని ఫాన్స్ ఆశించారు. రెండో ఓవర్లో అటాకింగ్ చేసిన అతడు మూడో ఓవర్లో పెవిలియన్ చేరాడు. ఘజన్‌ఫర్‌ బౌలింగ్‌లో మూడో ఓవర్ చివరి బంతికి తిలక్‌ వర్మకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 14 బంతుల్లో 22 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. దాంతో చెన్నై అభిమానులు నిరాశకు గురయ్యారు.

చెన్నై జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రుతురాజ్‌ గైక్వాడ్.. బ్యాటింగ్‌లో మాత్రం పూర్తిగా విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో అతని స్కోర్లు చూస్తే.. షాక్ అవ్వాల్సిందే. ఈ సీజన్‌లో వరుసగా 6(11), 28(22), 7(3), 15(18), 7(6), 19(13), 22(14) స్కోర్లు చేశాడు. మొత్తంగా 7 మ్యాచ్‌ల్లో 104 పరుగులు మాత్రమే సాధించాడు. అతని సగటు 14.85 కాగా.. స్ట్రైక్ రేట్ 119.54గా ఉంది. ఓ టాప్ ఆర్డర్ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా ఈ గణాంకాలు చాలా నిరాశాజనకంగా ఉన్నాయి.

సాధారణంగా రుతురాజ్‌ గైక్వాడ్ నిలకడగా బ్యాటింగ్ చేస్తాడు. ఈ సీజన్‌లో తన సహజమైన ఆటను కనబరచలేకపోతున్నాడు. పవర్‌ప్లేలో పెద్దగా ప్రభావం చూపలేకపోవడం జట్టుపై ఒత్తిడిని పెంచుతోంది. ముఖ్యంగా మంచి స్టార్ట్ ఇవ్వాల్సిన ఓపెనర్‌గా అతని వైఫల్యం సీఎస్‌కే బ్యాటింగ్ లైనప్‌ను బలహీనపరుస్తోంది. కెప్టెన్‌గా కూడా గైక్వాడ్ పెద్దగా ప్రభావం చూపడం లేదు. జట్టును సమర్థంగా నడిపించడంలో తడబడుతున్నాడు. ముఖ్యంగా బ్యాటింగ్ ఫామ్ లేకపోవడం అతనిపై అదనపు ఒత్తిడిని తెస్తోంది. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పటికీ విజయాలు అందుకోవడం లేదు. దాంతో అతడిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. రుతురాజ్‌ను వెంటనే జట్టు నుంచి తీసేయండి సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచులో చెన్నై ప్లేయర్స్ బాగా ఆడుతున్నారు. 15 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 149 రన్స్ చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ హాఫ్ సెంచరీ బాదాడు. 26 బంతుల్లోనే ఫిఫ్టీ చేసి చెన్నై భారీ స్కోరుకు బాటలు వేశాడు. రుతురాజ్‌ గైక్వాడ్ (22), సర్ఫరాజ్ ఖాన్ (14), శివమ్ దూబే (5), డెవాల్డ్ బ్రెవిస్ (21) రన్స్ చేశారు. క్రీజులో సంజు శాంసన్ (62), కార్తీక్ త్యాగి (18) ఉన్నారు. చెన్నై ఇలానే కొనసాగితే 200 ప్లస్ స్కోర్ చేయడం ఖాయం.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story