Sai Sudharsan: మ్యాచ్ గెలిచాం నా ఫేవరెట్ షాప్‌కి వెళ్లి ఎంజాయ్ చేస్తా!
Sai Sudharsan: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం ఎం చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి అద్భుత ఇన్నింగ్స్ ఆడారు.
Sai Sudharsan: మ్యాచ్ గెలిచాం నా ఫేవరెట్ షాప్‌కి వెళ్లి ఎంజాయ్ చేస్తా!
Sai Sudharsan: ఐపీఎల్ 2026లో అద్భుత ఫామ్‌లో ఉన్న సాయి సుదర్శన్ మరోసారి తన క్లాస్‌ను చాటుకున్నాడు. ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం ఎం చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. 46 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 87 రన్స్ చేసి గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ గెలిచినందుకు చాలా ఆనందంగా ఉందన్నాడు. హోం గ్రౌండ్‌లో ఆడటం తనకు ఎంతో ప్రత్యేకంగా అనిపించిందని చెప్పాడు. ఇక తన ఫేవరెట్ టీ షాప్‌కి వెళ్లి బన్ మస్కా, చాయ్‌తో కొంత సమయం గడపాలని అనుకుంటున్నా అని తెలిపాడు.
'నిజం చెప్పాలంటే చాలా సంతోషంగా ఉన్నాను. సొంత మైదానంలో తిరిగి ఆడటం చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకుల మద్దతు అద్భుతంగా అనిపించింది' అంటూ సాయి సుదర్శన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తన బ్యాటింగ్ ఫామ్ గురించి మాట్లాడుతూ.. గత ఇన్నింగ్స్ ఇచ్చిన నమ్మకమే తన ప్రదర్శనకు ప్రధాన కారణమని వివరించాడు. 'పరుగులు వచ్చాయా లేదా అనే దాని గురించి ఆలోచించకుండా.. ఆట ఎలా సాగుతోంది అన్న దానిపై దృష్టి పెట్టాను. గత ఇన్నింగ్స్ నుంచి వచ్చిన కాన్ఫిడెన్స్‌ను కొనసాగించడం నా టార్గెట్' అని చెప్పాడు.
పిచ్ పరిస్థితుల గురించి మాట్లాడిన సాయి సుదర్శన్ రెండో ఇన్నింగ్స్‌లో కొంత మెరుగుదల కనిపించిందని అన్నాడు. 'మొదటి ఆరు ఓవర్లలో మాత్రం బ్యాటింగ్ కొంచెం కష్టంగా అనిపించింది. కానీ ఆ సమయంలో మంచి షాట్లు ఆడడంతో మాకు బలమైన ఆరంభం దక్కింది' అని చెప్పాడు. తన బ్యాటింగ్ టెక్నిక్‌పై మాట్లాడుతూ.. బంతిని ఆలస్యంగా ఆడటంపై ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నానని తెలిపాడు.
'మొదటి కొన్ని మ్యాచ్‌ల్లో నేను రిథమ్‌లో లేను. కానీ ఇప్పుడు రిథమ్ అందుకున్నాక సహజంగా ఆడుతున్నా. బంతిని లేట్‌గా ఆడటంపై దృష్టి పెట్టా' అని పేర్కొన్నాడు. మ్యాచ్ తర్వాత తన ప్లాన్ గురించి సరదాగా స్పందిస్తూ.. 'నా ఫేవరెట్ టీ షాప్‌కి వెళ్లి బన్ మస్కా, చాయ్‌తో కొంత సమయం గడపాలని అనుకుంటున్నాను. ఆపై తదుపరి మ్యాచ్ గురించి ఆలోచిస్తా' అని సాయి తెలిపాడు. ఈ మాటలు అభిమానుల్లో చిరునవ్వులు పూయించాయి.




