Sakib Hussain: అయ్యో సకీబ్ హుస్సేన్, కావ్య మారన్ హగ్ మిస్ అయ్యిందే.. ఛాన్స్ కొట్టేసిన హింగే!
Sakib Hussain: అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టిన హింగే, హుస్సేన్‌లకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Sakib Hussain: అయ్యో సకీబ్ హుస్సేన్, కావ్య మారన్ హగ్ మిస్ అయ్యిందే.. ఛాన్స్ కొట్టేసిన హింగే!
Sakib Hussain: ఐపీఎల్ 2026లో భాగంగా ఏప్రిల్ 13న ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ను 57 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 రన్స్ చేసింది. ఇషాన్ కిషన్ (91; 44 బంతుల్లో), క్లాసెన్ (40; 26 బంతుల్లో) రాణించాడు. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. అరంగేట్ర పేసర్లు ప్రఫుల్ హింగే (4/34), సకీబ్ హుస్సేన్ (4/24) తలో నాలుగు వికెట్లు పడగొట్టి ఆర్ఆర్ పతనాన్ని శాసించారు. అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టిన హింగే, హుస్సేన్‌లపై ప్రశంసల వర్షం కురిసింది. అయితే తాజాగా వీరికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాజస్థాన్ రాయల్స్‌పై అద్భుత ప్రదర్శన అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్స్ అందరూ మైదానంలో సంబరాలు చేసుకుంటున్నారు. ఆటగాళ్లను అభినందించేందుకు సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ మైదానంలోకి వచ్చారు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న యువ ఆటగాడు ప్రఫుల్ హింగేకు అభినందనలు తెలిపారు. అతని ప్రదర్శనకు మెచ్చిన కావ్య పాప.. హింగేకు ప్రేమగా హగ్ ఇచ్చారు. అదే సమయంలో పక్కనే నిలబడ్డ సకీబ్ హుస్సేన్ ఆ హగ్ తనకే అనుకుని చేతులు చాపాడు. అయితే ఆ హగ్ హింజే కోసం అని గ్రహించిన సాకిబ్.. కాస్త ఇబ్బందిగా ఫీలయ్యాడు. వెంటనే దాన్ని కవర్ చేసేందుకు ఒక చిరునవ్వుతో తన భావాలను దాచుకున్నాడు. ఈ సన్నివేశం అక్కడ ఉన్నవారిని నవ్వుల్లో ముంచెత్తగా.. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మ్యాచ్ ముగిసిన వారం తర్వాత సకీబ్ హుస్సేన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సరదా సంఘటన అభిమానులను నవ్వుల్లో ముంచెత్తింది. 'అయ్యో సకీబ్ హుస్సేన్', 'కావ్య మారన్ హగ్ మిస్ అయ్యిందే', 'సూపర్ ఛాన్స్ కొట్టేసిన హింగే' అంటూ నెటిజెన్స్ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. నీక్కూడా కావ్య మారన్ హగ్ ఇస్తుంది.. ఏం అవసరం లేదు' అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. నిజానికి హింగేకే కావ్య హగ్ ఇవ్వడానికి కారణం ఉంది. హింగే తన తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు పడగొట్టాడు. వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, ప్రిటోరియస్ లాంటి టాప్ బ్యాటర్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. తన రెండో ఓవర్లో రియాన్ పరాగ్ (4)ని ఔట్ చేసి ఆర్‌ఆర్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు.




