IPL 2026: సైనికుడు కావాల‌నుకున్నాడు క్రికెట‌ర్ అయ్యాడు.. సాకిబ్ స‌క్సెస్ స్టోరీ

IPL 2026: బీహార్ రాష్ట్రంలోని గోపాల్గంజ్‌కు చెందిన సాకిబ్ హుసైన్ చిన్నప్పటి నుంచి భారత ఆర్మీలో చేరాలని ఆశపడ్డాడు.

Mokshith
Published on: 14 April 2026 2:58 PM IST
IPL 2026
X

IPL 2026

IPL 2026: బీహార్ రాష్ట్రంలోని గోపాల్గంజ్‌కు చెందిన సాకిబ్ హుసైన్ చిన్నప్పటి నుంచి భారత ఆర్మీలో చేరాలని ఆశపడ్డాడు. దేశానికి సేవ చేయాలని రైఫిల్ పట్టాలని అనుకున్నాడు. కానీ అతని జీవిత గమ్యం క్రికెట్ వైపు మళ్లింది. ఎన్నో కష్టాలు ఎదురైనా, తన లక్ష్యాన్ని వదల్లేదు. చివరకు ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో చోటు సంపాదించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

సాకిబ్ కుటుంబ పరిస్థితులు చాలా కష్టంగా ఉండేవి. అతని తండ్రి రైతు. కానీ మోకాళ్ల నొప్పి కారణంగా వ్యవసాయం చేయలేకపోయాడు. దీంతో ఇంట్లో ఆర్థిక సమస్యలు తీవ్రమయ్యాయి. ఆ సమయంలో క్రికెట్ ఆడేందుకు అవసరమైన షూస్ కొనలేని పరిస్థితి వచ్చింది. అప్పుడే సాకిబ్ తల్లి తన ఆభ‌ర‌ణాలు అమ్మి అతనికి షూస్ కొనిచ్చింది. ఆ త్యాగం ఇప్పుడు ఫలించింది.

ఐపీఎల్ డెబ్యూలోనే రికార్డ్ సమానం

ఏప్రిల్ 13న హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్టును ఓడించింది. ఆ మ్యాచ్‌లో సాకిబ్ హుసైన్ కీలక పాత్ర పోషించాడు. తన తొలి మ్యాచ్‌లోనే 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 4 వికెట్లు ప‌డ‌గొట్టి రికార్డు సృష్టించాడు. గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున అశ్విని కుమార్ చేసిన రికార్డును సాకిబ్ సమం చేశాడు.

సాకిబ్ బౌలింగ్ ప్రత్యేకత అతని వేగం. అలాగే అతని స్లో బంతులు బ్యాట్స్‌మెన్‌ను మోసం చేస్తాయి. తన తొలి మ్యాచ్‌లోనే డోనోవన్ ఫెరెరాను స్లో బంతితో ఔట్ చేసి తన ప్రతిభ చూపించాడు. ఇప్పటివరకు సాకిబ్ తన T20 కెరీర్‌లో 13 మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లు తీసాడు. 20 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసిన ప్రదర్శన అతని బెస్ట్. ఇప్పుడు ఐపీఎల్ వేదికగా సాకిబ్ హుసైన్ పేరు మరింత ప్రాచుర్యం పొందుతోంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story