Viral Video: ఢాకా వన్డేలో హైడ్రామా.. వింత రనౌట్ తో పాక్ ప్లేయర్ వీరంగం.. పొట్టుపొట్టుగా తిట్టుకున్నారుగా

Salman Agha runout controversy: పాకిస్థాన్–బంగ్లాదేశ్ మధ్య ఢాకాలో జరిగిన రెండో వన్డేలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. పాకిస్థాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా విచిత్రంగా రనౌట్ కావడంతో మైదానంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Venkat
Published on: 13 March 2026 11:16 PM IST
Viral Video
X

Viral Video: ఢాకా వన్డేలో హైడ్రామా.. వింత రనౌట్ తో పాక్ ప్లేయర్ వీరంగం.. పొట్టుపొట్టుగా తిట్టుకున్నారుగా

Salman Agha runout controversy: పాకిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య ఢాకాలోని షేర్ ఏ బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో (Sher-e-Bangla National Cricket Stadium)లో రెండో వన్డే మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ (Pakistan) పటిష్ట స్థితిలో కనిపించింది. మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత మహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan), సల్మాన్ అలీ ఆఘా (Salman Ali Agha)తో కలిసి నాలుగో వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఈ భాగస్వామ్యం వల్ల పాకిస్థాన్ జట్టు భారీ స్కోర్ వైపు దూసుకెళ్తుందని అనిపించింది.

అరుదైన రనౌట్ ఎలా జరిగింది?

మ్యాచ్‌లో 39వ ఓవర్ నాలుగో బంతికి ఈ ఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ కెప్టెన్ హసన్ మిర్జా (Mehidy Hasan Miraz) బౌలింగ్‌లో రిజ్వాన్ ముందుకు షాట్ ఆడాడు. బంతి నెమ్మదిగా నాన్ స్ట్రైకర్ వైపు వచ్చింది. ఈ సమయంలో క్రీజ్ బయట ఉన్న సల్మాన్ అఘా బంతిని అడ్డుకునేందుకు ట్రై చేశాడు. బంగ్లా బౌలర్ మీహిదీ హసన్ మీరాజ్ కూడా అక్కడే ఉన్నాడు. వెంటనే మీరాజ్ బంతిని తీసుకుని స్టంప్స్‌ వైపు విసిరి, అంపైర్ కు అప్పీల్ చేశారు. అఘా క్రీజ్ బయట ఉన్నాడని గుర్తించిన అంపైర్ అతడిని రనౌట్‌గా ప్రకటించాడు.

ఆగ్రహంతో ఊగిపోయిన సల్మాన్ అఘా..

ఈ నిర్ణయాన్ని చూసి సల్మాన్ అఘా తీవ్రంగా ఆగ్రహించాడు. అతను తన హెల్మెట్, బ్యాట్‌ను కోపంతో విసిరేసి మైదానంలో అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఈ క్రమంలో సల్మాన్ ఆఘా బంతిని తీసి ఇవ్వడానికే ప్రయత్నించానని, ఇది జెంటిల్ మెన్ గేమ్ కు విరుద్ధమని వాదించాడు. అయితే, ఫీల్డ్ అంపైర్ ఈ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్ కు ఇచ్చాడు. అక్కడ సల్మాన్ ఆఘాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.

ఆటగాళ్ల మధ్య వాగ్వాదం..

ఈ ఘటన తర్వాత పాకిస్థాన్ ఆటగాళ్లు, బంగ్లాదేశ్ ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. అఘా, లిట్టన్ దాస్ మధ్య కూడా వాగ్వాదం చోటుచేసుకుంది. లిట్టన్ దాస్ మాత్రం మీరాజ్ చర్య పూర్తిగా నిబంధనలకు అనుగుణమని పేర్కొన్నాడు.

ఇక రిజ్వాన్ కూడా బంగ్లాదేశ్ ఆటగాళ్లతో మాట్లాడి అప్పీల్‌ను వెనక్కి తీసుకోవాలని కోరాడు. అయితే, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి ఇష్టపడలేదు.

మరోసారి చర్చలోకి ఏంజెలో మ్యాథ్యూస్ ఘటన..

ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో మరోసారి పాత సంఘటన మరోసారి చర్చకు వచ్చింది. ఏంజెల్ మాథ్యూస్ (Angelo Mathews 2023) ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై టైమ్-అవుట్‌గా అవుట్ అయిన ఘటనను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు కూడా బంగ్లాదేశ్ ఆటగాళ్ల చర్యలను క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించారంటూ విమర్శలు వినిపించాయి.

మ్యాచ్ పరిస్థితి..

పాకిస్థాన్ జట్టు 47.3 ఓవర్లకు 274 పరుగులకు ఆలౌట్ అయింది. సల్మాన్ అఘా 62 బంతుల్లో 64 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ పాకిస్థాన్‌కు కీలకంగా మారింది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో ఓడితే సిరీస్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం బంగ్లా టీం 6.3 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 27 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది.




Venkat

Venkat

Next Story