RCB-IPL 2026: పటిదార్, కృనాల్ పాండ్యా మెరుపులు.. విరాట్ కోహ్లీ టీమ్ ఓటమి!
భారత క్రికెట్లో యువ ఆటగాళ్లలో ఒకడైన వికెట్‌కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.
RCB-IPL 2026: పటిదార్, కృనాల్ పాండ్యా మెరుపులు.. విరాట్ కోహ్లీ టీమ్ ఓటమి!
RCB-IPL 2026:ఇండియన్ ప్రీమియర్ లెగ్ (ఐపీఎల్) 2026 మార్చి 28 నుంచి ఆరంభం కానుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. 2025 సీజన్లో టైటిల్ గెలిచిన ఆర్సీబీ.. ఈసారి కూడా మంచి ప్రదర్శన ఇచ్చి మరోసారి టైటిల్ గెలవాలని చూస్తోంది. ఇప్పటికే ప్రాక్టీస్ క్యాంపులో ఆర్సీబీ ఆటగాళ్లు ముమ్మరంగా సాధన చేస్తున్నారు. టోర్నీకి సమయం దగ్గర పడుతుండడంతో ఆర్సీబీ ప్లేయర్స్ ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది.
ఆర్సీబీ జట్టులో జరిగిన ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో బ్యాటర్లు దుమ్మురేపారు. టీమ్ కృనాల్ (కృనాల్ పాండ్య), టీమ్ వెంకీ (వెంకటేష్ అయ్యర్) మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. మొదట బ్యాటింగ్ చేసిన వెంకీ టీమ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీమ్ వెంకీ తరఫున జితేష్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 37 బంతుల్లో 81 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. టిమ్ డేవిడ్ 14 బంతుల్లో 36 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 12 బంతుల్లో 29 పరుగులు, వెంకటేశ్ అయ్యర్ 16 బంతుల్లో 30 పరుగులు చేశారు.
234 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కృనాల్ టీమ్ మరింత దూకుడుగా ఆడింది. 20 ఓవర్లలో 247 పరుగులు చేసి అద్భుత విజయం సాధించింది. జట్టు విజయంలో రాజత్ పటిదార్ కీలక పాత్ర పోషించాడు. కేవలం 25 బంతుల్లో 74 పరుగులు బాదాడు. దేవదత్ పడిక్కల్ 33 బంతుల్లో 63 పరుగులు, కృనాల్ పాండ్యా 33 బంతుల్లో 58 పరుగులతో చెలరేగి జట్టును గెలిపించారు. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కృనాల్ పాండ్యా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు. మొత్తంగా ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ఆర్సీబీ బ్యాటింగ్ బలం ఎలా ఉందో స్పష్టం చేసింది. ఐపీఎల్ 2026లో ఆర్సీబీ ఎలా రాణిస్తుందోననే ఆసక్తిని అభిమానుల్లో పెంచింది.




