Sanju Samson Trolls: ఈ ఆట ఏంది, ఇంట్రెస్ట్ లేకపోతే తప్పుకో.. సంజు శాంసన్‌పై సీఎస్కే ఫ్యాన్స్ ఫైర్!
Sanju Samson faces criticism after fail in IPL 2026. ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో సంజు శాంసన్ 6, 7, 9 పరుగులు మాత్రమే చేశాడు. సింగిల్ డిజిట్ స్కోర్లతో వెనుదిరుగుతూ అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు.
Sanju Samson Trolls: ఈ ఆట ఏంది, ఇంట్రెస్ట్ లేకపోతే తప్పుకో.. సంజు శాంసన్‌పై సీఎస్కే ఫ్యాన్స్ ఫైర్!
Sanju Samson Trolls: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తరఫున ఆడుతున్న సంజు శాంసన్ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. ఇటీవల టీ20 ప్రపంచ కప్ 2026లో భారత జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించిన శాంసన్.. ఐపీఎల్లో మాత్రం తన ఫామ్‌ను కొనసాగించలేకపోతున్నాడు. వరుసగా సింగిల్ డిజిట్ స్కోర్లతో వెనుదిరుగుతూ అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో 6, 7, 9 పరుగులు మాత్రమే చేశాడు.
సంజు శాంసన్ ఐపీఎల్ 2026 వేలం ముందు రాజస్థాన్ రాయల్స్ నుంచి ట్రేడ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరాడు. దాంతో శాంసన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీ20 ప్రపంచ కప్ 2026లో చెలరేగడంతో సీఎస్కే ఫాన్స్ అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. అయితే సంజు టాప్ ఆర్డర్లో పూర్తిగా విఫలమవడం జట్టుకు పెద్ద దెబ్బగా మారింది. సీఎస్కే వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోవడానికి సంజు పేలవ ప్రదర్శన కూడా ఓ కారణం అనే చెప్పాలి. అభిమానులు మాత్రమే కాకుండా జట్టు మేనేజ్మెంట్ కూడా అతని ఫామ్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
సంజు శాంసన్ ప్రదర్శనతో పాటు అతని బాడీ లాంగ్వేజ్ కూడా సీఎస్కే ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తోంది. మ్యాచ్‌ల సమయంలో ఉత్సాహం లేకుండా, నిరుత్సాహంగా కనిపిస్తున్నాడని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ఫ్యాన్స్ సంజు ఆసక్తి లేకుండా ఆడుతున్నట్లు కనిపిస్తున్నాడని విమర్శిస్తున్నారు. 'మీకు ఆసక్తి లేకపోతే కొద్ది మ్యాచ్‌లకు తప్పుకోండి. మీలో ఉత్సాహం, పోరాటం కనిపించడం లేదు' అంటూ ఒక సీఎస్కే అభిమాని కామెంట్ చేయడం వైరల్‌గా మారింది. 'మానసికంగా సిద్ధంగా లేకపోతే కొంతకాలం జట్టుకు దూరంగా ఉండటం మంచిది', 'ఈ ఆట ఏంది సంజు', 'ఇంట్రెస్ట్ లేకపోతే తప్పుకో సంజు' అంటూ కొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్యాషన్ ఏది, హంగర్ ఏది సంజు అంటూ ఫాన్స్ ప్రశ్నిస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ భారీ స్కోర్ చేసింది. టిమ్ డేవిడ్ (25 బంతుల్లో 70 నాటౌట్), దేవదత్ పడిక్కల్ (50), ఫిల్ సాల్ట్ (46), రజత్ పాటిదార్ (19 బంతుల్లో 48 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌లతో ఆర్సీబీ 250/3 భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్య ఛేదనలో సీఎస్కే 30 పరుగులకే టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే సర్ఫరాజ్ ఖాన్ (25 బంతుల్లో 50), ప్రశాంత్ వీర్ (43), జేమీ ఓవర్టన్ (37) పోరాట ఇన్నింగ్స్‌లతో చెన్నైలో ఆశలు చెలరేగినప్పటికీ.. రన్‌రేట్ ఒత్తిడిని తట్టుకోలేక 207 పరుగులకు ఆలౌట్ అయి 43 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.


