ఓపక్క వణికిపోయా.. ఆ అనుభవాన్ని మర్చిపోలేను.. ఆసక్తికర విషయం చెప్పిన సారా టెండూల్కర్‌!

Sara Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ కుమార్తె సారా టెండూల్కర్‌ క్రీడా రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

Rishvik
Updated on: 11 Aug 2026 10:15 PM IST
Sara Tendulkar
X

ఓపక్క వణికిపోయా.. ఆ అనుభవాన్ని మర్చిపోలేను.. ఆసక్తికర విషయం చెప్పిన సారా టెండూల్కర్‌!

Sara Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ కుమార్తె సారా టెండూల్కర్‌ క్రీడా రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. గ్లోబల్‌ ఈ-క్రికెట్‌ ప్రీమియర్‌ లీగ్‌ (జీఈపీఎల్‌) రెండో సీజన్‌లో ముంబై ఫ్రాంచైజీకి ఆమె యజమానురాలు గా మారింది. జీఈపీఎల్‌ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-క్రికెట్‌ లీగ్‌. సాధారణంగా మైదానంలో క్రికెట్‌ను చూస్తూ పెరిగిన సారా.. ముంబై గ్రిజ్లీస్ జట్టు ఓనర్‌గా రెండో సీజన్‌ నుంచి కొనసాగుతున్నారు. సీజన్ 3 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా తనకు ఎదురైన ఉత్కంఠభరిత అనుభవాన్ని తాజాగా సారా పంచుకున్నారు. ఫైనల్ మ్యాచ్‌కు ముందు తాను చాలా టెన్షన్‌కు గురయ్యానని, మ్యాచ్‌ను ప్రశాంతంగా చూసేందుకు ప్రయత్నించినప్పటికీ తన వల్ల కాలేదని సారా వెల్లడించారు.

‘నేను వీలైనంత ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను. కానీ గ్లోబల్‌ ఈ-క్రికెట్‌ ఫైనల్ సమయంలో చాలా నర్వస్‌గా అనిపించింది. నా గోళ్లను కోరుకున్నా, చర్మాన్ని గిచ్చుకున్నా. ఇది మీరు గమనించారో లేదో తెలియదు. అంతగా టెన్షన్ పడ్డాను. ‘నా జీవితమంతా మైదానంలో క్రికెట్‌ను చూస్తూనే పెరిగాను. కానీ ఇది నాకు పూర్తిగా కొత్త, భిన్నమైన విషయం. ఈ-క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత తాను ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటున్నా.

ఈ రంగంలో ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది' అని సారా తెలిపారు. తన తండ్రి సచిన్ టెండూల్కర్‌ కారణంగా చిన్నప్పటి నుంచే క్రీడా ప్రపంచాన్ని దగ్గరగా చూసిన సారాకు ఆటగాళ్లపై ఉండే అంచనాలు, ఒత్తిడి గురించి బాగా తెలుసు. అయితే ఒక జట్టుకు యజమానిగా ఉండటం మాత్రం పూర్తిగా భిన్నమైన అనుభవమని ఆమె చెబుతున్నారు. ప్రేక్షకురాలిగా మ్యాచ్ చూడటం కంటే.. జట్టు విజయం కోసం తెరవెనుక నిర్ణయాల్లో భాగస్వామి కావడం తనకు కొత్త అనుభూతిని ఇచ్చిందని చెప్పుకొచ్చారు.

అయితే సంప్రదాయ క్రికెట్ అయినా.. ఈ-క్రికెట్ అయినా కొన్ని విషయాలు మాత్రం ఒకేలా ఉంటాయని సారా టెండూల్కర్‌ అభిప్రాయపడ్డారు. ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే అంకితభావం, కష్టపడి పనిచేయడం చాలా అవసరమని చెప్పారు. ఆట మైదానంలో జరిగినా, స్క్రీన్‌పై జరిగినా.. ఆటగాళ్లు, జట్లు చేసే కృషి మాత్రం ఎంతో కీలకమని పేర్కొన్నారు. సారా యజమానిగా వ్యవహరిస్తున్న ముంబై గ్రిజ్లీస్.. గ్లోబల్ ఈ-క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్-3లో ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్ సారాకు ప్రత్యేకంగా మారింది. ఎందుకంటే.. ఆమె కుటుంబ సభ్యులు కూడా ఈ మ్యాచ్‌ను వీక్షించారు.

సారా తల్లి అంజలి, అమ్మమ్మతో కలిసి జట్టును ఉత్సాహపరిచారు. సారాకు ఇది యజమానిగా రెండో సీజన్. క్రీడా ప్రపంచాన్ని ఇంతకాలం ఒక ప్రేక్షకురాలిగా చూసిన ఆమె.. ఇప్పుడు ఒక జట్టును నడిపించే బాధ్యతను తీసుకున్నారు. మైదానంలో తండ్రి సచిన్ టెండూల్కర్ తన ఆటతో కోట్లాది మంది అభిమానులను అలరించినట్లే.. సారా కూడా తనదైన రీతిలో క్రీడా రంగంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story