Shivam Dube Train Journey: రహస్యంగా శివమ్ దూబే ప్రయాణం.. జస్ట్ మిస్ భయ్యో!

Shivam Dube Train Journey: భారత యువ ఆల్‌రౌండర్‌ శివమ్ దూబే చాలా రిస్క్ చేశాడు. అహ్మదాబాద్ నుంచి ముంబైకి ఆయన తెల్లవారుజామున ట్రైన్‌లో ప్రయాణించాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Rishvik
Published on: 12 March 2026 5:44 PM IST
Shivam Dube Train Journey: రహస్యంగా శివమ్ దూబే ప్రయాణం.. జస్ట్ మిస్ భయ్యో!
X

Shivam Dube Train Journey: రహస్యంగా శివమ్ దూబే ప్రయాణం.. జస్ట్ మిస్ భయ్యో!

Shivam Dube Train Journey: భారత్‌లో క్రికెట్‌ ప్రేమికులు ఎక్కువ. క్రికెటర్ల ఆట చూసేందుకు ఫాన్స్ మైదానాలకు క్యూ కడుతుంటారు. అలాంటిది ఓ ఆటగాడు బయట కనిపిస్తే ఊరుకుంటారా?.. ఆటోగ్రాఫ్‌లు, ఫొటోలు అంటూ మీదపడిపోతుంటారు. ఇక టీ20 ప్రపంచ కప్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాడు కంట పడితే.. ఊహించడం కష్టమే. అయినా భారత యువ ఆల్‌రౌండర్‌ శివమ్ దూబే చాలా రిస్క్ చేశాడు. అహ్మదాబాద్ నుంచి ముంబైకి ఆయన తెల్లవారుజామున ట్రైన్‌లో ప్రయాణించాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

భారత్‌ టీ20 ప్రపంచకప్‌ గెలిచిన మరుసటి రోజు (మార్చి 9) ఉదయం 5 గంటలకు శివమ్ దూబే అహ్మదాబాద్ నుంచి ముంబైకి వెళ్లే ట్రైన్ ఎక్కాడు. విమాన టికెట్లు లభించకపోవడంతో ముంబైలోని తన పిల్లల దగ్గరకు త్వరగా చేరుకునేందుకు రైలు ప్రయాణాన్ని ఎంచుకున్నాడు. మధ్యాహ్నానికి ముంబై చేరుకున్నాడు. ఈ విషయాన్ని దూబేనే స్వయంగా చెప్పాడు. 'రోడ్డు మార్గం ద్వారా వెళితే ఆలస్యమవుతుందని రైల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యాం. థర్డ్‌ ఏసీ టికెట్లు బుక్‌ చేసుకున్నాం. అభిమానులు గుర్తిస్తే ఇబ్బందిపడతావని కుటుంబసభ్యులు హెచ్చరించారు. ఉదయం 5 గంటలకు రైల్వే స్టేషన్‌లో అభిమానులు ఎవరూ ఉండరనుకున్నా. కానీ భారత జెర్సీల్లో చాలా మందే కనిపించారు. ఎవరూ గుర్తించకుండా.. క్యాప్, మాస్క్‌ పెట్టుకున్నాను. ట్రైన్ కదలడానికి 5 నిమిషాల ముందు బెర్తు వద్దకు వెళ్లాను' అని చెప్పాడు.

'ట్రైన్‌లో 3వ ఎసీ కంపార్ట్‌మెంట్‌లో ఎక్కి పై బెర్త్‌లో పడుకున్నా. ప్రయాణం సాఫీగా సాగుతుండగా టికెట్ చెకర్ వచ్చాడు. ఇక్కడ శివమ్ దూబే ఎవరు?, క్రికెటరా అని అడిగితే.. నా భార్య చాకచక్యంగా రియాక్ట్ అయింది. లేదండి, ఆయన ఇక్కడికి ఎందుకు వస్తాడు? అని చెప్పడంతో టీసీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం సాగింది. చివరికి ముంబైలోని బోరివలి స్టేషన్‌కు సురక్షితంగా చేరుకున్నా. బోరీవలిలో అభిమానులు గుర్తిస్తే ఇబ్బంది తప్పదని పోలీసు సహాయం కోరా. తొలుత పోలీసులు విమానాశ్రయం అనుకున్నారు. కానీ రైల్వే స్టేషన్‌కు రావాలని చెప్పడంతో.. వారు ఆశ్చర్యపోయారు. పోలీసులు భద్రతతో సురక్షితంగా ఇంటికి చేరుకున్నా' అని శివమ్ దూబే చెప్పాడు. ఈ సంఘటన ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. సాధారణంగా స్టార్ క్రికెటర్లు విమానాల్లో ప్రయాణిస్తుంటారు. అయితే దూబే ఇలా సాధారణ ట్రైన్‌లో ప్రయాణించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.

Rishvik

Rishvik

Next Story