Shreyas Iyer First Win as Captain: వరుస ఓటములకు చెక్.. ఎట్టకేలకు విక్టరీ అకౌంట్ ఓపెన్.. శ్రేయస్ అయ్యర్ ఏమన్నాడంటే?
Shreyas Iyer First Win as Captain: హరారే వేదికగా జింబాబ్వేపై సాధించిన విజయం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు కొండంత ఉపశమనాన్ని ఇచ్చింది.
Shreyas Iyer First Win as Captain: వరుస ఓటములకు చెక్.. ఎట్టకేలకు విక్టరీ అకౌంట్ ఓపెన్.. శ్రేయస్ అయ్యర్ ఏమన్నాడంటే?
Shreyas Iyer First Win as Captain: భారత టీ20 సారథిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి శ్రేయస్ అయ్యర్‌కు ఏదీ కలసిరాలేదు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో వరుసగా ఓటములు ఎదురవడంతో అతడి కెప్టెన్సీపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. అయితే జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో సాధించిన విజయంతో వరుసగా 7 మ్యాచ్‌ల గెలుపు లేని రికార్డుకు శుభంకార్డు పడింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లోనూ ఓడిపోయి ఉంటే, అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లు విజయం సాధించని ఫుల్ మెంబర్ జట్ల జాబితాలో పాకిస్థాన్ (7 మ్యాచ్‌లు) కంటే ఘోరమైన స్థానంలో భారత్ నిలిచేది.
'వైభవ్ భయం లేని ప్లేయర్'..
మ్యాచ్ అనంతరం మాట్లాడిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, తొలి అంతర్జాతీయ అర్ధశతకాన్ని బాదిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురిపించాడు. "వైభవ్ ఆడిన తీరు నిజంగా అద్భుతం. అతడు మైదానంలోకి వస్తే ఎవరికీ భయపడడు, అతడిలో ఉండే ఆత్మవిశ్వాసం అపారమైనది" అని వ్యాఖ్యానించాడు. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇదే హరారే మైదానంలో 175 పరుగులు చేసిన అనుభవం ఉండటంతో, పిచ్‌ను ముందే అంచనా వేసి ఆడాడని శ్రేయస్ తెలిపాడు. 18 బంతుల్లోనే 50 పరుగులు చేసి వైభవ్ భారత్ విజయాన్ని సులభతరం చేశాడని కొనియాడాడు.
బౌలింగ్ పునాది వేసిన మయాంక్ యాదవ్..!
ముందుగా బౌలింగ్ ఎంచుకున్న తరుణంలో హరారే పిచ్‌పై మంచి బౌన్స్ లభించిందని, దానిని మన పేసర్ మయాంక్ యాదవ్ చక్కగా వాడుకున్నాడని శ్రేయస్ వెల్లడించాడు. గాయం నుంచి కోలుకుని రెండేళ్ల తర్వాత పునరాగమనం చేసిన మయాంక్ (2/18) తొలి బంతికే వికెట్ తీసి జింబాబ్వేను ఒత్తిడిలోకి నెట్టాడని గుర్తుచేశాడు. ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, రవి బిష్ణోయ్ తమ వంతు పాత్రను సరిగ్గా పోషించారని పేర్కొన్నాడు.
యంగ్ బ్రిగేడ్‌కు లభించిన సువర్ణావకాశం..!
సీనియర్ బౌలర్లు అర్ష్‌దీప్, బుమ్రా, హార్దిక్‌లకు విశ్రాంతినిచ్చి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం ద్వారా జట్టులో పోటీతత్వం పెరిగిందని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. తదుపరి మ్యాచ్‌లలో యష్ ఠాకూర్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ లాంటి యువ ఆటగాళ్లను కూడా ఆడించే యోచనలో ఉన్నట్లు కెప్టెన్ సూచనప్రాయంగా తెలిపాడు.
తొలి విజయం అందించిన ఉత్సాహంతో భారత్ ఇప్పుడు 3 మ్యాచ్‌ల సిరీస్‌ను కైవసం చేసుకోవడంపై దృష్టి సారించింది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని ఈ యువ జట్టు రాబోయే పోరులోనూ ఇదే రకమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందో లేదో చూడాలి.




