మేము చాలా తప్పులు చేశాం.. చాలా దారుణంగా ఆడాం.. శ్రేయస్ తీవ్ర అసంతృప్తి!
Shreyas Iyer: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. మంగళవారం రాత్రి ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత ఇంగ్లండ్ 201/7 స్కోరు చేయగా.. అనంతరం ఛేదనలో భారత జట్టు 76 పరుగులకే ఆలౌట్ అయింది.
మేము చాలా తప్పులు చేశాం.. చాలా దారుణంగా ఆడాం.. శ్రేయస్ తీవ్ర అసంతృప్తి!
Shreyas Iyer: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘోర పరాజయం పాలైంది. మంగళవారం రాత్రి ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 201/7 స్కోరు చేసింది. అనంతరం లక్ష ఛేదనలో భారత్ 76 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో 125 పరుగుల భారీ తేడాతో ఇంగ్లీష్ జట్టు విజయం సాధించింది. ఈ ఓటమితో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0తో వెనకపడిపోయింది. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. జట్టు ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
'ఇంత భారీ తేడాతో ఓడిపోవడం అస్సలు ఆమోదయోగ్యం కాదు. ఈ ఓటమిని వర్ణించడానికి నాకు మాటలు రావడం లేదు. అత్యంత దారుణం అనే పదం తప్ప మరోటి నాకు చెప్పడానికి కనిపించడం లేదు. ముందుగా మేము ఈ ఓటమిని అంగీకరించాలి. జట్టు సమావేశంలో ఎక్కడ తప్పు జరిగిందో పూర్తిగా విశ్లేషించుకోవాలి. నా దృష్టిలో ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్ 200 పరుగులు చేసే వికెట్ అసలు కాదు. మేము సరైన ప్రణాళికతో బౌలింగ్ చేయలేకపోయాం. ఈ పిచ్‌పై హార్డ్ లెంగ్త్ బంతులు బౌలర్లకు బాగా సహకరించాయి. కానీ మేము వాటిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాం. అదే మా ఓటమికి ప్రధాన కారణం' అని శ్రేయాస్ అయ్యర్ చెప్పాడు.
బ్యాటింగ్ వైఫల్యంపై టీమిండియా కెప్టెన్ శ్రేయాస్ స్పందించాడు. '201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలంటే ఇన్నింగ్స్‌ను బాగా ఆరంబించాలి. కానీ మేము పవర్‌ప్లేలోనే ఏకంగా ఐదు వికెట్లు కోల్పోయాం. అదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అయింది. పవర్‌ప్లేలోనే ఇంగ్లండ్ పూర్తిగా మ్యాచ్‌పై ఆధిపత్యం సాధించింది. మా బ్యాటర్లు పరిస్థితులకు తగ్గట్టు ఆడలేకపోయారు. అందరం విఫలమయ్యాం. ఒక్కరు కూడా మంచి ఇన్నింగ్స్ ఆడలేదు. గత ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ముందుకు సాగాలి. తదుపరి రెండు మ్యాచ్‌లపై ఇక దృష్టి పెట్టాలి. మేము చాలా దారుణమైన క్రికెట్ ఆడాం. కానీ ప్రతి ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ప్రతి ప్లేయర్ తన బాధ్యతను గుర్తించి జట్టు విజయానికి ఎలా ఉపయోగపడగలడో ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ మ్యాచ్‌ను గెలిపించేలా ఆడాలి. ప్రతి ఒక్కరి ప్రభావం జట్టుపై ఉంటేనే విజయం సాధ్యం అవుతుంది' అని పేర్కొన్నాడు.
మూడో టీ20లో చిత్తు చిత్తుగా ఓడిన భారత్.. సిరీస్‌లో నిలవాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. రెండు, మూడో మ్యాచులో శ్రేయాస్ సేన ఓడిపోయింది. ఇక బ్రిస్టల్‌లో జరగనున్న నాలుగో టీ20లో గెలిచి.. సిరీస్ రేసులో నిలవాలని యువ భారత జట్టు చూస్తోంది. టీమిండియా అభిమానులు కూడా భారత జట్టు బలంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.




