Shubman Gill History: చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. దిగ్గజాలు సచిన్, కోహ్లీ వల్ల కూడా కాలేదు!
Shubman Gill Scripts History: శుభ్‌మన్ గిల్ భారత క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు.
Shubman Gill History: చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. దిగ్గజాలు సచిన్, కోహ్లీ వల్ల కూడా కాలేదు!
Shubman Gill History: చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. దిగ్గజాలు సచిన్, కోహ్లీ వల్ల కూడా కాలేదు! అఫ్గానిస్థాన్‌తో లక్నోలోని ఏకానా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో అలరించాడు.
భారత ఇన్నింగ్స్‌కు అండగా నిలిచిన గిల్.. కేవలం 110 బంతుల్లో 154 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతని ఇన్నింగ్స్‌లో 22 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన గిల్ 39 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి.. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించి 77 బంతుల్లో శతకం బాదాడు.
భారత క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు:
ఈ భారీ ఇన్నింగ్స్‌తో శుభ్‌మన్ గిల్ భారత క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. వన్డే క్రికెట్‌లో 3,000 పరుగుల మైలురాయిని అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌లలో బాదాడు. గిల్ ఈ ఘనతను కేవలం 62 ఇన్నింగ్స్‌ల్లోనే అందుకున్నాడు.
గతంలో ఈ రికార్డు మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్, స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పేరిట ఉంది. ఈ ఇద్దరు 72 ఇన్నింగ్స్‌లలో మూడు వేళా రన్స్ బాదారు. మూడు వేల పరుగులు చేయడానికి కింగ్ విరాట్ కోహ్లీకి 75 ఇన్నింగ్స్‌లు, కేఎల్ రాహుల్‌కు 78, నవజ్యోత్ సిద్దూకు 79 ఇన్నింగ్స్‌లు పట్టాయి.
అత్యంత వేగంగా 3,000 పరుగులు:
ఇన్నింగ్స్‌ల పరంగా మాత్రమే కాదు, అత్యంత తక్కువ బంతుల్లో 3000 వన్డే పరుగులు పూర్తి చేసిన భారత బ్యాటర్ల జాబితాలో కూడా శుభ్‌మన్ గిల్ రెండో స్థానంలో నిలిచాడు. మూడు వేల పరుగులు చేయడనికి 3016 బంతులు ఎదుర్కొన్నాడు. భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ 2995 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకుని అగ్రస్థానంలో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ (3,049), వీరేంద్ర సెహ్వాగ్ (3,164) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
రోహిత్ శర్మ రికార్డు బ్రేక్:
భారత్ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా 150 పరుగులు చేసిన ఆటగాడిగా మరో రికార్డు గిల్ అందుకున్నాడు. ఈ జాబితాలో ఇంతకుముందు రోహిత్ శర్మ టాప్‌లో ఉన్నాడు. గౌహతిలో వెస్టిండీస్‌పై 117 బంతుల్లో 150 పరుగుచేశాడు. గిల్ ఆఫ్ఘనిస్తాన్‌పై 108 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేశాడు.
భారత్ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా 150 రన్స్ చేసిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు. ఇక వన్డేల్లో కెప్టెన్‌గా గిల్‌కు ఇది మొదటి శతకం కావడం విశేషం. మొత్తంగా వన్డే కెరీర్‌లో 9వ సెంచరీ. దాంతో వన్డేల్లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (9 సెంచరీలు) సరసన గిల్ చేరాడు.
సూపర్ ఫామ్‌లో గిల్:
ఇటీవలి కాలంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ మరోసారి తన క్లాస్‌ను నిరూపించాడు. కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరింత పరిపక్వతతో బ్యాటింగ్ చేస్తున్న గిల్.. అఫ్గానిస్థాన్‌పై ఈ భారీ సెంచరీతో భారత జట్టుకు భారీ స్కోరు అందించాడు.
అదే సమయంలో భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి మహానుభావులకు కూడా సాధ్యం కాని.. 3,000 వన్డే పరుగుల మైలురాయిని చేరుకుని ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఈ ఇన్నింగ్స్‌తో గిల్ కేవలం మ్యాచ్‌ను మాత్రమే కాదు.. రికార్డుల పుస్తకాలను కూడా షేక్ చేశాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.




