Shubman Gill: ఒకే ఒక్క విజయం.. రోహిత్, కోహ్లీని వెనక్కి నెట్టేసిన శుభ్‌మన్ గిల్!
Shubman Gill: Shubman Gill Closes In On No. 1 Spot In ODI Rankings. ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నంబర్-1 స్థానానికి మరింత చేరువయ్యాడు.
Shubman Gill: ఒకే ఒక్క విజయం.. రోహిత్, కోహ్లీని వెనక్కి నెట్టేసిన శుభ్‌మన్ గిల్!
Shubman Gill: మంగళవారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 75 బంతుల్లో 80 పరుగులు చేసి భారత జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. దాంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో గిల్ నంబర్-1 స్థానానికి మరింత చేరువయ్యాడు. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 12 రేటింగ్ పాయింట్లు సంపాదించిన ప్రిన్స్.. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్‌కు కేవలం 11 రేటింగ్ పాయింట్ల దూరంలో నిలిచాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ రాణిస్తే.. గిల్ ప్రపంచ నంబర్-1 వన్డే బ్యాటర్‌గా నిలవనున్నాడు.
అగ్ర స్థానంలో డారిల్ మిచెల్:
బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో డారిల్ మిచెల్ 814 రేటింగ్ పాయింట్లతో అగ్ర స్థానంలో ఉన్నాడు. 803 రేటింగ్ పాయింట్లతో శుభ్‌మన్ గిల్ రెండో స్థానంలో ఉన్నాడు. మొదటి వన్డేలో విఫలమైన సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు పాయింట్స్ కోల్పోయారు. కోహ్లీ 11 పాయింట్లు నష్టపోయి 757 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా.. రోహిత్ 10 పాయింట్లు కోల్పోయి 744 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ అర్ధ సెంచరీతో రాణించి 12వ స్థానానికి చేరుకున్నాడు. భారత వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ కూడా 12వ స్థానంలో కొనసాగుతున్నారు.
దూసుకొచ్చిన అక్షర్ పటేల్:
మొదటి వన్డే మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన అక్షర్ పటేల్ కూడా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చాడు. బౌలింగ్‌లో నాలుగు వికెట్లు తీసి, బ్యాటింగ్‌లో అజేయ అర్ధశతకం సాధించిన అక్షర్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 18 స్థానాలు ఎగబాకి.. 73వ స్థానానికి చేరుకున్నాడు. బౌలర్ల జాబితాలో రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 42వ స్థానంలో నిలిచాడు. ఇక ఐసీసీ వన్డే ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి ప్రవేశించి తొమ్మిదో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. హాఫ్ సెంచరీ చేసిన వాషింగ్టన్ సుందర్ 24 స్థానాలు మెరుగుపరుచుకుని బ్యాటర్లలో 177వ స్థానానికి, ఆల్‌రౌండర్ల జాబితాలో 16 స్థానాలు ఎగబాకి 55వ స్థానానికి చేరుకున్నాడు. దాదాపు 968 రోజుల తర్వాత వన్డేల్లోకి తిరిగొచ్చిన జస్ప్రీత్ బుమ్రా కూడా ర్యాంకింగ్స్‌లో సత్తాచాటాడు. తొలి వన్డేలో 1/31తో ఆకట్టుకున్న బుమ్రా.. ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 24వ స్థానానికి చేరుకున్నాడు.
12 స్థానాలు ఎగబాకిన బ్రూక్:
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ 76 పరుగులతో సంయుక్తంగా 12వ స్థానానికి ఎగబాకగా.. లియామ్ డాసన్ 68 పరుగుల ఇన్నింగ్స్‌తో ఏకంగా 81 స్థానాలు మెరుగుపరుచుకుని 262వ స్థానానికి చేరుకున్నాడు. టీ20 ర్యాంకింగ్స్‌లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. భారత్‌పై ఐదు మ్యాచ్‌ల్లో 229 పరుగులతో చెలరేగిన ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ 12 స్థానాలు ఎగబాకి ఏడో స్థానానికి చేరుకున్నాడు. చివరి టీ20లో కెరీర్ బెస్ట్ 131 పరుగులు చేసిన జోస్ బట్లర్ ఆరో స్థానానికి చేరుకోగా.. ఏడు వికెట్లు పడగొట్టిన జోఫ్రా ఆర్చర్ ఎనిమిది స్థానాలు మెరుగుపరుచుకుని సంయుక్తంగా 18వ స్థానంలో నిలిచాడు.




